దినేష్ కార్తీక్ విషయం లో కీలక ప్రకటన చేయనున్న బిసిసిఐ..?

ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ప్రతి టీం తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్( Royal Challengers Bengaluru ) టీం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.

ఇక ఈ టీమ్ లో ఉన్న ప్లేయర్లందరు మంచి ఫామ్ లో ఉన్నారు.

ఇక దినేష్ కార్తీక్( Dinesh Karthik ) మాత్రం 38 సంవత్సరాల వయసులో కూడా అద్భుతమైన బ్యాటింగ్ తీరును కనబరుస్తు ముందుకు సాగడం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి.

"""/" / ఆయన ఈ సీజన్ లో 6 ఇన్నింగ్స్ ల్లో 226 పరుగులు చేశాడు.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తో జరిగిన మ్యాచ్ లో 35 బంతుల్లో 83 పరుగులు చేసి టీం కి ఘన విజయాన్ని అందించే ప్రయత్నం అయితే చేశాడు.

ఇక అందులో భాగంగానే చివరి వరకు పోరాడి బెంగళూరు టీం ఓడిపోయింది.ఇక దినేష్ కార్తీక్ ఆడిన ఆట మాత్రం చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పాలి.

మరి ఈ దెబ్బతో ఇప్పుడు జరగబోయే టి 20 వరల్డ్ కప్ కి( T20 World Cup ) దినేష్ కార్తీక్ ని సెలెక్ట్ చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక ఇప్పటికే వికెట్ కీపర్ల మధ్య చాలా పోటీ నెలకొంటున్న సందర్భంలో దినేష్ కార్తీక్ ని టీం లోకి తీసుకొని ఆయన చేత మ్యాచ్ లు ఆడిస్తారా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.

"""/" / ఇక ఇంతకుముందు కూడా దినేష్ కార్తీక్ ఐపీఎల్లో మంచి పర్ఫామెన్స్ ని కనబరిచినప్పటికీ ఆయన్ని ఇండిన టీమ్ లో తీసుకున్నారు.

కానీ ఆయన అక్కడ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు.మళ్లీ ఆయన్ని టీంలోకి తీసుకునే ప్రయత్నాలు అయితే చేయడం లేదు.

మరి ఇప్పుడు అద్భుతమైన ఫామ్ లో ఉన్న దినేష్ కార్తీక్ ను తీసుకుంటే టి20 వరల్డ్ కప్ కి కొంతవరకు హెల్ప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

కాబట్టి ఆయన్ని కూడా ఒకసారి తీసుకునే ఆలోచన చేస్తే బాగుంటుందని పలువురు మాజీ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)