ఇండోర్‌ పిచ్‌ రేటింగ్‌ను సవరించిన బీసీసీఐ… కారణం ఇదే!

అవును, మీరు వినండి నిజమే.ఐసీసీ ఇండోర్ పిచ్( Indore Pitch ) రేటింగుని బీసీసీఐ సవరించింది.

ఈ క్రమంలో 'పూర్' నుంచి 'బిలో యావరేజ్'కు మార్పు చేసింది.భారత్, ఆస్ట్రేలియా 3వ టెస్టుకు( Australia ) ఉపయోగించిన ఈ పిచ్ పైన బీసీసీఐ ఫిర్యాదు చేయడంతో మ్యాచ్ ఫుటేజీని పరిశీలించి ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టును ఇండోర్లో నిర్వహించగా ఈ మ్యాచ్ కేవలం 7 సెషన్లే జరిగింది.

రెండు జట్ల స్పిన్నర్లు చెలరేగి ఆడడంతో బ్యాటర్లు ఒకింత ఇబ్బంది పడిన పరిస్థితి.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా విజయం అందుకొని టీమ్ఇండియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించేసింది. """/" / ఈ క్రమంలో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఈ పిచ్ కి 'పూర్' రేటింగ్ ఇచ్చాడు.

మూడు డీమెరిట్ పాయింట్లు ప్రకటించాడు.ఇప్పుడు దానిని ఐసీసీ దానికి ఒక డీమెరిట్ పాయింట్ కి తగ్గించింది.

ఈ విషయమై ఐసీసీ మీడియాతో మాట్లాడుతూ.'భారత్, ఆసీస్ మూడో టెస్టు మ్యాచ్ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.

ఐసీసీ క్రికెట్ జీఎం వసీమ్ ఖాన్, ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు రోజర్ హార్పర్తో కూడిన బృందం మ్యాచ్ రిఫరీ నిబంధనల ప్రకారమే మేము నడుచుకున్నాం.

అయితే పూర్ రేటింగ్ ఇచ్చేంత ప్రమాదకరమైన బౌన్స్ అయితే లేదు.దాంతో అప్పీల్ ప్యానెల్ రేటింగ్ ని బిలో యావరేజికి మారుస్తున్నాం' అని వెల్లడించింది.

"""/" / ఇకపోతే అంతకు ముందు క్రిస్ బ్రాడ్( Chris Broad ) మాట్లాడుతూ.

'పిచ్ చాలా దారుణంగా వుంది.మందకొడిగా తయారైంది.

బ్యాటు, బంతికి అస్సలు పొంతనే లేదు.మొదటి నుంచే ఈ పిచ్ కేవలం స్పిన్నర్లకు మాత్రమే అనుకూలించింది.

ఐదో బంతికే బంతి పిచ్ పైన పగుళ్లకు కారణమైంది.చాలాసార్లు అలాగే జరిగింది.

మ్యాచ్ మొత్తం కూడా అనూహ్యమైన బౌన్స్ కనిపించింది' అని నివేదిక ఇవ్వడం జరిగింది.

దాంతో ఐసీసీ వారు పరిశీలించారు.ఇకపోతే ఐసీసీ నిబంధనల ప్రకారం 5 అంతకన్నా ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే ఆ పిచ్ ని దాదాపు 12 నెలల పాటు నిషేధిస్తారు.

కల్కి బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆమెకు మాత్రం లాభం లేదా.. ఆ పాత్రకు ఎవరైనా ఒకటే అంటూ?