A+,A,B,C కాంట్రాక్ట్ లిస్ట్ లో ఉన్న క్రికెటర్లకు బీసీసీఐ ఏడాదికి ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసా?

ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగిస్తున్న క్రీడ క్రికెట్.ఈ ఆటకు ప్రపంచంలో అత్యధిక అభిమానులున్నారు.

క్రికెట్ వస్తుందంటే చాలు.ఇప్పటి ప్రపంచ వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోతారు.

ప్రపంచంలోనే ఇండియన్ క్రికెట్ బోర్డు బాగా రిచ్.ఒక్కసారి టీమిండియా జట్టుకు సెలెక్ట్ అయితే చాలు అని వేలాది మంది యువకులు కలలుగంటారు.

కానీ అందరికీ ఆ అవకాశం దక్కదు.ఒక్కసారి దక్కిందా.

వారి పంట పండాల్సిందే.పేరుకు పేరు.

డబ్బుకు డబ్బు.అన్నీ వచ్చి చేరుతాయ్.

క్రికెటర్లను బీసీసీఐ సెలెక్ట్ చేసుకునే విధానం నాలుగు గ్రేడ్ లలో ఉంటుంది.మొత్తం 28 మంది ఆయా గ్రేడ్ ల కింది ఎంపిక చేసుకుంటుంది.

వారి కేటగిరీలను బట్టి ఏడాదికి ఇంత అని డబ్బులు ఫిక్స్ చేస్తారు.ఇంతకీ టీమిండియా క్రికెటర్లు ఎన్ని గ్రేడ్లలో ఉంటారు? ఏ గ్రేడ్ వారికి ఎన్ని డబ్బులు ఇస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బీసీసీఐ మొత్తం 4 గ్రేడ్ లుగా క్రికెటర్లను తీసుకుంటుంది.అవి గ్రేడ్ ఏ ప్లస్, గ్రేడ్ ఏ, గ్రేబ్ బీ, గ్రేడ్ సీ ఉంటాయి.

గ్రేడ్ ఏ ప్లస్ కింద సెలెక్ట్ అయిన క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ.7కోట్లు ఇస్తారు.

గ్రేడ్ ఏ కింద ఎంపిక అయిన వారికి ఒక్కొక్కరికి 5 కోట్లు ఇస్తారు.

గ్రేడ్ బీ కింద 3 కోట్లు, గ్రేడ్ సీ క్రకెటర్లకు కోటి రూపాయలు అందిస్తారు.

టీమిండియాలో ఏ క్రికెటర్.ఏ గ్రేడ్ కింద సెలెక్ట్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం.

గ్రేడ్ ఏ ప్లస్- విరాట్ కోహ్లీ, రోహిత్, బుమ్రా గ్రేడ్ ఏ- అశ్విన్, జ‌డేజా, పుజారా, ర‌హానే, ష‌మి, రిష‌బ్ , ఇషాంత్, ధ‌వ‌న్, రాహుల్, పాండ్యా గ్రేడ్ బీ- వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాద‌వ్, భువ‌నేశ్వ‌ర్, శార్థూల్ ఠాకూర్, మ‌యాంక్ అగ‌ర్వాల్ గ్రేడ్ సీ: కుల్దీప్ యాద‌వ్, న‌వ‌దీప్ సైనీ, శుభ్ మ‌న్ గిల్, దీప‌క్ చ‌హార్, హ‌నుమ విహారీ, అక్ష‌ర్ ప‌టేల్, శ్రేయ‌స్ అయ్య‌ర్, వాషింగ్ట‌న్ సుంద‌ర్, చాహాల్, సిరాజ్ ఉన్నారు.

ప్రశాంత్ వర్మ ఖాతాలో మరో ప్లాప్ సినిమా…కారణం ఏంటి..?