వివో తప్పుకోవడంతో బీసీసీఐకి పోయేదేం లేదంటున్న సౌరవ్ గంగూలీ..!

భారత్- చైనా ఉద్రికత్తల నడుమ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) యొక్క టైటిల్ స్పాన్సర్ ‌షిప్ నుంచి వివో తప్పుకోవడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి పెద్దగా వచ్చే నష్టం అంటూ ఏమిలేదని బీసీసీఐ ఛైర్మెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు.

ఇది కేవలం ఒక చిన్న ఆటంకం తప్పితే.ఎలాంటి ఆర్థిక సంక్షోభం మాత్రం కానే కాదని స్పష్టం చేశాడు.

బలంగా ఉన్న బీసీసీఐ ఇలాంటి చిన్న సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడతదని ధీమా వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ వివో సంస్థ బీసీసీఐతో 2017లో ఐదేళ్ల కాలానికి రూ.2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో భాగంగా టైటిల్ స్ఫాన్సర్ ‌గా ప్రతిఏటా రూ.440 కోట్లు చెల్లిస్తోంది.

ఇకపోతే ఈ అగ్రిమెంట్ ఐపీఎల్ 2022 సీజన్ వరకు ఉంది.కాకాపోతే ప్రస్తుతం చైనాతో సరిహద్దుల్లో ఉన్న ఘర్షణ కారణంగా దేశంలో కూడా చైనా దేశ ఉత్పత్తులపై వ్యతిరేకత మొదలైంది.

ఈ పరిస్థితుల నడుమ ఐపీఎల్‌ 2020కి సంబంధించి బీసీసీఐ, వివో తమ భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి.

ఇక ఈ విషయంపై తాజాగా బీసీసీఐ ఛైర్మెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.ఇది బీసీసీఐలో పెద్ద ఆర్థిక సంక్షోభం కాదని, ఒక చిన్న అవరోధం మాత్రమే అని తెలిపాడు.

ప్రస్తుతం తాము ప్రొఫెషనల్‌గా చాలా స్ట్రాంగ్ ‌గా ఉన్నామని, ఏవైనా పెద్ద విషయాలు ఓవర్‌ నైట్ ‌లో జరగవని, అలాగని ఓవర్ ‌నైట్ ‌లో అవి పోవని తెలిపాడు.

అయితే కొన్నిసార్లు విజయం సాధించాలంటే మరికొన్ని ఆటంకాలను కచ్చితంగా ఎదురుకోవబలాని తెలిపారు.అయితే బీసీసీఐ ఎంతో బలమైన సంస్థ అని, గతంలో పనిచేసిన ఆడ్మినిస్ట్రేటర్స్, ఆట ఆర్గనైజేషన్ ‌ను ఎంతో స్ట్రాంగ్ చేశాయి తెలిపారు.

కాబట్టి ఇలాంటి చిన్న వాటిని హ్యాండిల్ చేసే సత్తా బోర్డుకు ఉందని గంగూలీ పేర్కొన్నాడు.

"""/"/ అయితే ఇప్పటికే అనేక సంస్థల పేర్లు తెరమీదికి వచ్చినా అయితే రేస్‌లో అందరికంటే ముందున్న రిలయన్స్ జియో, స్పాన్సర్ ‌షిప్ విషయంలో కాస్త వెనుకడుగు వేసినట్లు కనపడుతోంది.

ఇకపోతే జియో సంస్థ వెనక్కి తగ్గడంతో బీసీసీఐ ఇప్పుడు టాటా మోటార్స్, పేటీఎమ్, బైజూస్, డ్రీమ్ 11 ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే, సంప్రదించినా ఊహించినంత ప్రోత్సాహం లభించలేదని వారి సమాచారం.

3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్..: ఏపీ సీఈవో