పురుషులతో పాటే మహిళల ఐపీఎల్… త్వరలోనే
TeluguStop.com
ఐపీఎల్ నిర్వహణకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే మ్యాచ్ లు అన్ని కూడా యూఏఈ లో నిర్వహించడానికి ఒకే చెప్పింది.
ఇండియాలో పర్మిషన్ లేదు.ఇక ప్రేక్షకులు కూడా పరిమితంగానే ఉండే విధంగా చూసుకోవాలని సూచించింది.
అన్ని రకాల షరతులతో లీగ్ నిర్వహణకి పచ్చజెండా ఊపింది.ఇక కరోనా భయం నుంచి ప్రజల దృష్టి మార్చడానికి ఐపీఎల్ ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా రోగం కంటే కరోనా వస్తుందనే భయంతో జనాలు బ్రతుకుతున్నారు.ఈ భయానికి విముక్తి దొరకాలంటే ఐపీఎల్ తోనే సాధ్యం అని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సారి పురుషుల ఐపీఎల్ లో మహిళల జట్లతోనూ కొన్ని మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కూడా దీనిపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు.
యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ లో మహిళల మ్యాచ్ లకు కూడా అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ప్రాథమికంగా మహిళా క్రికెటర్లను మూడు జట్లుగా విభజించి మ్యాచ్ లు ఆడించాలన్నది తమ ఆలోచన అని బోర్డు వర్గాలు తెలిపాయి.
ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.ఇప్పుడిప్పుడే పురుషుల క్రికెట్ తో పాటు మహిళల క్రికెట్ కి కూడా ప్రాధాన్యత పెరుగుతుంది.
అదే సమయంలో వారికి కూడా మంచి జీతాలు అందుతున్నాయి.ఎప్పటి నుంచి మహిళా క్రికెటర్లు తమకి ఐపీఎల్ నిర్వహించాలని కోరుతున్నారు.
ఈ నేపధ్యంలో బీసీసీఐ ఆ దిశగా తుది నిర్ణయం తీసుకునేలా ఉంది.మరి మెన్స్ ఐపీఎల్ మాదిరి విమెన్ ఐపీఎల్ కూడా ప్రజాదరణ పొందుతుందో లేదో వేచి చూడాలి.
ఆట మొదలెట్టిన డొనాల్డ్ ట్రంప్ .. 7.25 లక్షల మంది భారతీయులు ఇంటికే?