నిబంధనలు ఉల్లంఘించిన నీతా అంబానీ.. నోటీసులిచ్చిన బీసీసీఐ

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే అందరికీ టక్కున గుర్తు వచ్చే టీమ్ ముంబై ఇండియన్స్.

దేశంలో అత్యంత ధనవంతులైన నీతా అంబానీ దానికి యజమానిగా ఉన్నారు.అయితే ఆమెకు తాజాగా షాక్ తగిలింది.

గత సీజన్‌లో జట్టు పేలవ ప్రదర్శన కనబర్చిన బాధను మర్చిపోక ముందే ఆ జట్టుకు ఊహించని అనుభవం ఎదురైంది.

ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీకి బీసీసీఐ తాజాగా నోటీసులు పంపింది.విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలపై సెప్టెంబర్ 2లోగా లిఖితపూర్వకంగా స్పందించాలని బీసీసీఐ నీతి అధికారి వినీత్ శరణ్ శుక్రవారం ఆమెకు నోటీసులు పంపించారు.

డీకే జైన్ స్థానంలో బీసీసీఐ ఎథిక్స్ అండ్ అంబుడ్స్‌మెన్‌గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శరణ్, MPCA మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా నుండి ఫిర్యాదును స్వీకరించిన తర్వాత నీతా అంబానీకి నోటీసు ఇచ్చారు.

"""/"/ ఎంపిసిఎ సభ్యుడు సంజీవ్ గుప్తా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్‌గా ఉన్నందున ముంబై ఇండియన్స్ యాజమాన్యం ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఆరోపణలొచ్చాయి.

ఇటీవల ఐపీఎల్ డిజిటల్ హక్కులను అనుబంధ సంస్థ వయాకామ్ 18 ద్వారా రూ.

23,758 కోట్లకు రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసింది.వయాకామ్ 18 ఆర్‌ఐఎల్ అనుబంధ సంస్థ అని ఆర్‌ఐఎల్ వెబ్‌సైట్ పేర్కొన్నట్లు గుప్తా తన ఫిర్యాదులో రాశారు.

శరణ్ తన ఆర్డర్‌లో ఇలా పేర్కొన్నాడు."బిసిసిఐ నియమాలు మరియు నిబంధనలలోని రూల్ 39(బి) ప్రకారం, కొన్ని చర్యలకు సంబంధించి, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఎథిక్స్ ఆఫీసర్ ద్వారా ఫిర్యాదు అందిందని మీకు దీని ద్వారా తెలియజేస్తున్నాము.

2-9-2022లోపు ఫిర్యాదుకు వ్రాతపూర్వక ప్రతిస్పందనను ఫైల్ చేయాలి" అని నోటీసులు పంపించారు.

యూకేలో భారతీయ మహిళ దారుణహత్య .. బస్టాప్‌లో పొడిచి పొడిచి చంపిన దుండగుడు