ఆశ వర్కర్లకు మద్దతు తెలిపిన బీసీ విద్యార్థి సంఘం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆశ వర్కర్లు చేస్తున్న సమ్మెకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు కలిసి పూర్తి మద్దతు సంఘీభావం తెలిపారు.

అనంతరం వారు మాట్లాడుతూ వారి న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేశారు.

వాళ్లకు ఉద్యోగ భద్రత అలాగే వారి జీతం 18 వేల వరకు పెంచాలని అన్నారు.

కరోనా టైం లో వాళ్ళ ప్రాణాలను తెగించి గ్రామాలలో కరోనా గురించి ప్రజలకు వివరించారని తెలిపారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు వెంటనే వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

దాదాపు 13 రోజుల నుండి సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని ఇప్పటికైనా వాళ్ల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం తంగళ్ళపల్లి అధ్యక్షుడు గౌరీ రాకేష్ ముదిరాజ్, నాయకులు లక్ష్మణ్, నవీన్, వంశీ,అశోక్,తదితరులు పాల్గొన్నారు.

ఆగష్టు చివరి వారంలో ప్రేక్షకులను అలరించే చిత్రాలివే.. సరికొత్త రికార్డ్స్ ఖాయమా?