బీసీ కుల గణన చేపట్టాలని పూలే విగ్రహం ముందు నిరసన
TeluguStop.com
యాదాద్రి జిల్లా:త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో బిసి కుల గణన చేపట్టి కులాల వారిగా ఎవరి శాతం ఎంతో లెక్క తేల్చాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పూలే విగ్రహం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో చెట్లకు,గుట్లలకి,జంతువులకు చివరికి క్రిమి కీటకాలకు కూడా ఎన్నున్నాయో లెక్కలు ఉంటాయి కానీ,దేశంలో సగ భాగమైన బీసీలకు లెక్కలు లేకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం లెక్కలు తీయమంటే కుంటి సాకులు చెబుతోందని,బీసీల గణన చేయకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాసికంటి లక్ష్మీనర్సయ్య, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అన్యమైన వెంకటేశం,చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జల్ది రాములు,రజక సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ ముదిగొండ రాములు,గీత సంఘం జిల్లా నాయకులు పుట్ట రమేష్ గౌడ్,రజక సంఘం నాయకులు చింతల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
అల్లు అర్జున్ కేసు నుంచి బయట పడతాడా..?