బీసీబంధా బీఆర్ఎస్ బంధా…?

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar )నియోజకవర్గంలో బీసీబంధును బీఆర్ఎస్ కార్యకర్తలకు అది కూడా జీవోలో లేని కులాలకు ఇస్తుండటంతో దానిని బీఆర్ఎస్ బంధుగా మార్చితే ఏ గొడవా ఉండదని స్థానిక బీసీ ప్రజలు అంటున్నారు.

కుల వృత్తి దారులకు ఆర్థిక చేయూత అందించడానికి బీసీబంధు పథకం తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికి వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయనేది యదార్థం.

సాగర్ నియోజకవర్గంలో 377 మందికి మొదటి విడత బీసీబంధు కింద ఎమ్మెల్యే నోముల భగత్ హాలియా( MLA Nomula Bhagat ) కేంద్రంలో చెక్కులు అందించారు.

కానీ,అందుల సామాన్యులకు ఎవరికి రాకుండా నిత్యం తన వెంట తిరిగే కార్యకర్తలకు మాత్రమే బీసీబందు ఇచ్చారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అన్ని అర్హతలున్న వారికి ఇవ్వకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చెక్కులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

బీసీ బంధు కోసం ప్రభుత్వం పేర్కొన్న కులాలకు కాకుండా ఇతరులైన బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారానే ఆరోపణలు కూడా బలంగా విన్పిస్తున్నాయి.

హాలియా మున్సిపాలిటీ కేంద్రంలో ఒక్కో లబ్ధిదారుడి దగ్గర 30శాతం కమిషన్ వసూలు చేసినట్టు వార్తలు జోరుగా విన్పిస్తున్నాయి.

అర్హులకు కాకుండా సొంత కార్యకర్తలకు బీసీబంధు ఇచ్చుకోవడంతో ఎమ్మెల్యే నోముల భగత్ పై నియోజకవర్గ బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా కుల వృత్తిదారుల కోసం పెట్టిన పథకం రాజకీయ బ్రోకర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది.

బీఆర్ఎస్ పార్టీలో తిరిగితే లేదా చేరితేనే బీసీ బంధు ఇస్తారా అని చేపూర్ గ్రామానికి చెందిన కొండమీది రాము రజక అన్నారు.

బీసీబంధుకు నాకు అన్ని రకాలుగా అర్హత ఉందని,కానీ, బీఆర్ఎస్ అనే అర్హత లేదని,నేను నిరుద్యోగంతో బాధపడుతున్నానని,ఇన్ని రోజులు బీసీబంధు ద్వారా లక్ష రూపాయలు వస్తే షాప్ పెట్టుకుందాం అనుకున్న కానీ,పార్టీల తిరిగినోళ్ళకే వస్తదని ఇపుడు పూర్తిగా అర్ధమైందన్నారు.

ఇప్పటికైనా బీసీబంధును అర్హతలు ఉన్నవారికే ఇవ్వాలని కోరారు.

How Modern Technology Shapes The IGaming Experience