పోరు లాభం – పొత్తు నష్టం ?
TeluguStop.com
నిజానికి ప్రజారాజ్యం అనుభవాల తర్వాత మరోసారి పార్టీ పెట్టడానికి చాలా ధైర్యం కావాలి, ఆ పార్టీ తాలూకూ వైఫల్యాలు తనను నీడలా వెంటాడతాయని తెలిసినా ఆ విషయంలో తెగువ చూపించిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గత దశాబ్ద కాలంలో జనసేన ను ఈ స్థాయిలో నిలబెట్టడానికి అకుంఠిత పట్టుదల చూపించారన్నది సుస్పష్టం.
ముఖ్యంగా రెండుసార్లు ఓడిపోయినా కూడా రాష్ట్ర రాజకీయ యువనికపై తన పార్టీని ఈ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చారంటే దాని వెనక పవన్ పట్టుదలతో పాటు దానిని నమ్ముకున్న లక్షలాది కార్యకర్తల శ్రమ , పోరాటం ఉన్నాయన్నది కదనలేని విషయం .
"""/" / అర్ధరాత్రి కూడా తమ నాయకుడు కోసం రోడ్డు పైకి వచ్చి పోరాటాలు చేసే యువత జనసేన సొంతం, పసిపిల్లల్ని భుజంపై వెసుకొచ్చి రోడ్డుకి అడ్డంగా కుర్చీని ధర్నాలు చేసే వీర మహిళలు జనసేన పార్టీలో మాత్రమే ఉంటారు.
వీరికి పదవులు కానీ కనీసం పవన్తో ఒక్క ఫోటో కూడా అవసరం లేదు.
వీరికి జనసేన జెండా తాలూకు అండ ఒక్కటి సరిపోతుంది .అలాంటి నిబద్ధతగల జనసైనికులకు నాయకత్వం వహిస్తున్న పవన్ తొందర పడ్డారా అంటే అవుననే సమాధానం వస్తుంది .
"""/" / ఈరోజు రాజమండ్రి( Rajahmundry )లో ఆయన ప్రకటించిన నిర్ణయం పై మిశ్రమ స్పందన వస్తుంది .
జనసేన ను కూడా ఒక సాధారణ రాజకీయ పార్టీగా, తెలుగు దేశానికి బీ పార్టీగా మార్చేశారన్న విశ్లేషణలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి.
రెండు పార్టీలు కలిసి నడవడం అంటే కచ్చితంగా పెద్దన్న పాత్ర తెలుగుదేశమే పోషిస్తుంది.
రేపు ఉమ్మడిగా మెజారిటీ సాధించిన కూడా ముఖ్యమంత్రి పదవిపై నిస్సందేహంగా చంద్రబాబే కూర్చుంటారు.
ఇక జనసేనకు రాజకీయంగా స్వంత గుర్తింపు అన్నది కష్టమవుతుంది.అంతేకాకుండా వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం( TDP ) తీసుకునే నిర్ణయాలలో వైఫల్యాన్ని, ప్రభుత్వ వ్యతిరేకతను కూడా తెలుగుదేశంతో పాటు జనసేన కూడా భరించాల్సి ఉంటుంది.
ఇలా అధికారం దక్కదు కానీ వ్యతిరేకతలో మాత్రం భాగం దక్కుతుంది .కనీసం సీట్ల సర్దుబాటు అయినా చేసిన తర్వాత ఇలాంటి ప్రకటన చేసి ఉంటే ఏమో కానీ కేవలం 40 నిమిషాల భేటీతో పవన్ బేషరతు మద్దత్తు ప్రకటన చేయటం చాలామంది హార్డ్ కోర్ కార్యకర్తలకు కూడా జీర్ణించుకోవడం కష్టం అయిందన్నది వినిపిస్తున్న వార్తల సారాంశం .
ఏది ఏమైనా ఇంతకాలం పార్టీని తన భుజాలపై మోసిన చాలామంది కార్యకర్తల్లో మాత్రం ఒక అసంతృప్తి కలిగించిన రోజుగా మాత్రం ఈ రోజు మిగిలిపోతుంది
.
భారత్ – కెనడా ఉద్రిక్తతలు .. హిందూ పతాకాన్ని ఎగురవేసిన భారత సంతతి ఎంపీ