BJP MP Laxman : అభివృద్ధి, అబద్ధాలకు మధ్య పోరు..: ఎంపీ లక్ష్మణ్
TeluguStop.com
తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలు అభివృద్ధి, అబద్ధాలకు మధ్య జరిగే పోరని తెలిపారు.తెలంగాణలో పదికి తగ్గకుండా ఎంపీ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి( BRS ) రాజకీయ భవిష్యత్ లేదని చెప్పారు.అటు ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ దాట వేస్తోందని మండిపడ్డారు.
"""/" /
ఓఆర్ఆర్, కాళేశ్వరం మరియు ధరణి పోర్టల్ లో అవినీతి కనిపించినా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నోరు మెదపడం లేదని తెలిపారు.
బీజేపీని నిలువరించే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని ఆరోపించారు.దక్షిణ భారత్ ను విభజించాలని కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతున్నారని తెలిపారు.
ఇండియా కూటమి( India Alliance ) చీలికలతో కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు.ఇండియా కూటమికి అజెండా, నీతి లేదని ధ్వజమెత్తారు.
పుష్ప2 సినిమా పై ఫైర్ అయిన డైరెక్టర్.. ఇది మంచి పద్ధతి కాదంటూ కామెంట్స్!