ఆ ఉద్యమంతో కాంగ్రెస్ బీజేపీలకు 'కిక్కు' వస్తుందా ?

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ హవా తగ్గించడమే పనిగా టి.కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ప్రస్తుతం అధికార పార్టీ టిఆర్ఎస్ తమకు ఎదురే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడటం అదే సమయంలో బీజేపీ కి అంతగా పట్టు లేకపోవడం తదితర కారణాల వల్ల తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయాలు మొదలు పెట్టింది.

కేంద్రంతో తమకు లెక్కేలేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ రాజకీయాలు చేయడం బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

అందుకే ఏదో ఒక అంశాన్ని తలకెత్తుకుని టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని బీజేపీ చూస్తోంది.

ఇక కాంగ్రెస్ కూడా తెలంగాణలో బలహీనపడడం, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర బలమైన నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకోవడం తదితర కారణాలతో టిఆర్ఎస్ పార్టీపై గుర్రుగా ఉంది.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీ బలపడాలంటే టిఆర్ఎస్ హావ తగ్గించాల్సిందే అన్న ఆలోచనకు కాంగ్రెస్ పెద్దలు కూడా వచ్చేసారు.

అందుకే కాంగ్రెస్ బీజేపీలు విడివిడిగా టిఆర్ఎస్ పై ఎదురుదాడికి సిద్ధమవుతున్నాయి. """/" /ఇప్పటికే ఆర్టీసీ సమ్మె విషయంలో టీఆర్ఎస్ పై ఎదురు దాడికి దిగినా కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు.

ఆఖరికి దీంట్లో కెసిఆర్ దే పైచేయి కావడంతో ఈ రెండు పార్టీలు ఢీలా పడ్డాయి.

ఇప్పుడు టిఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేందుకు బలమైన కారణం ఏదైనా దొరుకుతుందా అనే విషయంలో కొంత కాలంగా ఈ రెండు పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

ఇదే సమయంలో తెలంగాణాలో మధ్య నిషేధం అనే నినాదాన్ని తెరమీదకు తీసుకువచ్చాయి ఈ రెండు పార్టీలు.

కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని బిజెపి కాంగ్రెస్ లో విడివిడిగా నిర్ణయించుకున్నాయి. """/" /ఇటీవల కాంగ్రెస్ నాయకులు సమావేశమై చర్చించారు.

తెలంగాణలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని మద్యం అమ్మకాలు పెరిగిపోవడం వల్ల మహిళలపై దాడులు జరుగుతున్నాయంటూ మల్లు భట్టి విమర్శలు చేశారు వస్తే చాలు ప్రజలు కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది ఇక బీజేపీ కూడా మద్యం నిషేధం పై బలంగా ప్రజల్లోకి వెళ్లాలని అవసరమైతే వచ్చే వారంలో రెండు రోజుల పాటు ఇందిరాపార్కు వద్ద నిరాహార నిరాహార దీక్ష చేయాలనే ఆలోచన చేస్తున్నారు పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని కూడా బిజెపి కోరుతోంది.

ఇక ఇటీవల అత్యాచారం హత్యకు గురైన సంఘటన కూడా ప్రతిపక్షాలు ఈ విధంగానే స్పందించాయి.

"""/" /జాతీయ రహదారి సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాకపోతే ముందు ముందు మరిన్ని దిశా సంఘటనలు జరుగుతాయని కాంగ్రెస్ బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.

రాబోయే రోజుల్లో తమకు రాజకీయంగా మంచి అవకాశం దక్కాలంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రజా ఉద్యమాలను చేసి తీరాలని, ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

అయితే ఆ ఫలితాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

2024 సంవత్సరంలో డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలివే.. భారీగా నష్టాలు వచ్చాయిగా!