ఊహించ‌ని విధంగా ఔట్ అయిన బ్యాట్స్ మెన్‌.. చూస్తే న‌మ్మ‌లేరు

క్రికెట్ ఈ పేరు వింటే చాలు ఎక్క‌డా లేని ఉత్సాహం వ‌స్తుంది మ‌న‌కు.

ఎందుకంటే దాంతో మ‌న‌కు ఉన్న అనుబంధం అలాంటిది మ‌రి.మ‌న దేశంలో ఏ ఆట అయినా స‌రే అది క్రికెట్ త‌ర్వాతే అన్న‌ది అంద‌రికీ తెలిసిందే.

అయితే క్రికెట్ కు సంబంధించిన వార్త‌లే కాదు క్రికెట‌ర్ల‌కు సంబంధించిన వార్త‌లు కూడా నిత్యం వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

మామూలుగానే క్రికెట‌ర్ల‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు.ఇక వారికి సోష‌ల్ మీడియాలో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంటుంది.

అయితే వారు చేసే ప‌నుల‌కు సంబంధించినివి  నిత్యం సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంటూనే ఉంటారు.

ఇప్పుడు కూడా ఓ క్రికెట్ కు సంబంధించిన వార్త నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.

అయితే బ్యాట్స్ మెన్‌ అలా ఎలా ఔట్ అయ్యాడ‌నే ప్ర‌శ్న ఈ వీడియో చూసిన త‌ర్వాత క‌చ్చితంగా ప్ర‌తి ఒక్క‌రికీ క‌లుగుతుందేమో.

ఎందుకంటే ఆయ‌న ఔట్ అయిన తీరు చూస్తే నిజంగానే షాకింగ్ లా ఉంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

ఇందులో ఓ క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా బ్యాట్స్ మెన్ బాల్ కోసం ఎదురు చూస్తున్న‌ట్టు మ‌నం చూడొచ్చు.

అయితే ఇంత‌లోనే బౌల‌ర్ అత్యంత వేగంతో బంతిని వేస్తాడు. """/" / ఇక దాన్ని బ్యాక్ స్లిప్ చేసేందుకు బ్యాట్స్ మెన్ ప్ర‌య‌త్నిస్తాడు.

అయితే అదికాస్తా అత‌ని బ్యాట్ కు తాకి ఆ త‌ర్వాత వెన‌కాలే క్యాచ్ కోసం వెయిట్ చేస్తున్న కీపర్ హెల్మెట్‌‌కు తాకుతుంది.

నిజానికి అది చూసిన వారంతా కీప‌ర్ క్యాచ్ ప‌ట్టుకున్నాడు కావ‌చ్చు అనుకుంటారు.కానీ అనూహ్యంగా అది కాస్తా గాల్లోకి లేచి ఇంకో వైపుకు వెళ్తుండగా మ‌రో బౌల‌ర్ దాన్ని క్యాచ్ ప‌ట్టుకోవ‌డం మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.

ఇదంతా క్ష‌ణ కాలంలో జ‌ర‌గ‌డంతో అస‌లు ఎలా ఔట్ అయ్యానా అంటూ బ్యాట్స్ మెన్ నిరాశ‌తో గ్రౌండ్ వీడటం ఇందులో మ‌నం చూడొచ్చు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!