బతుకమ్మ బ్రాండ్ చేనేత చీరలు తీసుకు వస్తాం
TeluguStop.com
తెలంగాణలో చేనేతను బాగు పర్చేందుకు బతుకమ్మ బ్రాండ్‌తో చీరలను తీసుకు వస్తామంటూ మంత్రి కేటీఆర్ ప్రకటించాడు.
వచ్చే ఏడాది నుండి బహిరంగ మార్కెట్‌లో బతుకమ్మ చీరలు సామాన్యులకు మరిన్ని వెరైటీల్లో అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేయబోతున్నట్లుగా కేటీఆర్ పేర్కొన్నాడు.
ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ కోసం మహిళలకు చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం చీరలను సిద్దం చేయించింది.
తాజాగా మంత్రి కేటీఆర్ మరియు ఇతర అధికారులు ఆవిష్కరించారు.మంత్రి కేటీఆర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ.
రాష్ట్రంలోని 1.20 కోట్ల మంది ఆడవారికి చీరలు అందించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
చేనేతన్నలు తయారు చేసిన ఈ చీరలు మహిళలకు చేరేందుకు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు సమర్ధంగా పని చేయాలంటూ కేటీఆర్ కోరడం జరిగింది.
ఈనెల 23 నుండి తెలంగాణ వ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నట్లుగా కూడా మంత్రి పేర్కొన్నారు.
బతుకమ్మ చీరల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.313 కోట్లు కేటాయించిందట.
ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్ల కి రిటైర్ మెంట్ అనేది లేదా..?