చైనాలో మళ్ళీ గబ్బిలాలను తింటున్నారుగా…

ప్రపంచంలోని మొత్తం దేశాలు ప్రస్తుతం  కరోనా  వైరస్ మంత్రాన్ని జపిస్తున్నాయి.అయితే ఈ కరోనా వైరస్ కారణంగా ఏకంగా కొన్ని దేశాల్లో లాక్ డౌన్ ని కూడా విధించారు.

దీనివల్ల లాక్ డౌన్ విధించిన దేశాల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్ మహమ్మారి చైనా దేశంలోని వ్యూహాన్ నగరంలో మొట్టమొదటిసారిగా కనిపించింది.

దీంతో అప్రమత్తమైనటువంటి చైనా ప్రభుత్వ అధికారులు ఈ కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే ఇందులో ముందుగా ఈ కరోనా వైరస్ గబ్బిలాల నుంచి సోకుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడంతో కొంతకాలం పాటు గబ్బిలాలు మాంస విక్రయాలను నిలిపివేశారు.

అయితే ప్రస్తుతం చైనా దేశంలో కరోనా వైరస్ ని నియంత్రిస్తుండడంతో మళ్లీ గబ్బిలం మాంస విక్రయాలను మొదలు పెడుతున్నారు.

దీంతో పలువురు ఈ గబ్బిలం మాంసం విక్రయాలపై అభ్యంతరం తెలుపుతున్నారు.అలాగే కొంత కాలం పాటూ ఈ మాంస విక్రయాలను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి కొందరు సూచిస్తున్నారు.

అయినప్పటికీ మాంస విక్రయదారులు మాత్రం వినకుండా మాంస విక్రయాలను యధావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు.దీంతో చైనా పక్కన ఉన్నటువంటి దేశాలు మళ్లీ భయపడుతున్నాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్  కారణంగా మృతి చెందినటువంటి మృతుల సంఖ్య విషయంలో చైనా తెలిపినటువంటి అధికారిక లెక్కలను మరికొందరు తప్పుబడుతున్నారు.

ఏదేమైనప్పటికీ చైనా లో పుట్టినటువంటి ఓ వైరస్ ప్రపంచ దేశాలను ఇంతగా కలవరపెడుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

రజినీకాంత్ ప్లాప్ డైరెక్టర్ల కు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదా..?