Barrelakka Sirisha : మొదలైన బర్రెలక్క పెళ్లి వేడుకలు.. నెట్టింట వీడియో వైరల్?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బర్రెలక్క అలియాస్ శిరీష( Barrelakka Sirisha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మొన్నటి వరకు ఈమె పేరు సోషల్ మీడియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిన విషయం తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలవ్వడంతో ఆమె సోషల్ మీడియాకు అలాగే అటు మీడియా దూరమైంది.

ఇక ఎన్నికల సమయంలో అయితే ప్రతి ఒక్కరూ ఆమెకి మద్దతుగా నిలిచారు. """/" / కానీ ఎవరు ఊహించని విధంగా ఆమె ఎన్నికల్లో పోటీ చేసి మరీ ఓటమిపాలైంది.

ఆ సంగతి పక్కన పెడితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందనుకున్న శిరీష పెళ్లి( Sirisha Marriage ) చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది.

ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.ఈ నెల 28న వివాహా బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది.

ఇటీవల తన పెళ్లి వీడియోని, కాబోయే భర్తను పరిచయం చేస్తూ ప్రీ వెడ్డింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసింది.

దీంతో ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు.ఇకపోతే బర్రెలక్క పెళ్లి రేపే కావడంతో ఇవాల్టి నుంచే బర్రెలక్క పెళ్లిసందడి షూరూ అయింది.

"""/" / మొదటి రోజు హల్దీ వేడుకలో( Haldi Event ) భాగంగా పెళ్లి కూతురిగా ముస్తాబైంది.

దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.పెళ్లి పిల్లను చేస్తున్నారు అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ వీడియో చూసిన నెటిజన్స్ మా బర్రెలక్క పెళ్లికూతురాయనే అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.