డార్క్ స్పాట్స్‌ను నివారించే బార్లీ గింజ‌లు..ఎలాగంటే?

కాస్త తియ్య‌గా, కాస్త వగరుగా ఉండే బార్లీ గింజలు చలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.

అందుకే స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే.బార్లీ గింజ‌ల‌ను విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు.

అలాగే బరువు తగ్గించ‌డంలో, బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేయ‌డంలో, నీర‌సం, అల‌స‌ట స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో, కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించ‌డంలో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా బార్లీ గింజ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి.

అయితే బార్లీ గింజులు ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ముఖ్యంగా డార్క్ స్పాట్స్‌ను నివారించ‌డంలో బార్లీ గింజ‌లు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.మ‌రి చ‌ర్మానికి వీట‌ని ఎలా వాడాలి ? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బార్లీ గింజ‌ల‌ను పొడి చేసుకుని ఆ త‌ర్వాత అందులో ఓట్స్ పొడి, రోజ్ వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మివ్ర‌మాన్ని డార్క్ స్పాట్స్ ఉన్న చోట పూసి ఇర‌వై నిమిషాల పాటు డ్రైఅవ్వ‌నివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే డార్క్ స్పాట్స్ క్ర‌మంగా దూరమ‌వుతాయి.

"""/"/ అలాగే ఒక బౌల్‌లో బార్లీ గింజ‌ల పొడి, కొద్దిగా నిమ్మ ర‌సం వేసి క‌లుపు కోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి పావు గంట పాటు వ‌దిలేయాలి.

ఇప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల డార్క్ స్పాట్స్ పోవ‌డంతో పాటు చ‌ర్మంపై మ‌లినాలు, మృత‌క‌ణాలు కూడా పోయి ముఖం అందంగా మారుతుంది.

బార్లీ గింజ‌ల‌ను నీటిలో వేసి నాన‌బెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా తేనె వేసి క‌లిపి ముఖానికి ప‌ట్టించాలి.

బాగా డ్రై అయిన త‌ర్వాత కొద్దిగా నీళ్లు జ‌ల్లి వేళ్ల‌తో స్క్ర‌బ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల డార్క్ స్పాట్స్ పోతాయి.మ‌రియు ముఖం కాంతివంతంగా మారుతుంది.

అదిరిపోయే స్పీచ్ ఇచ్చి అందరినీ నవ్వించిన చిన్నారి.. వీడియో వైరల్..