ఈ పిండితో బీపీని సుల‌భంగా కంట్రోల్ చేసుకోవచ్చు..తెలుసా?

అధిక ర‌క్త‌పోటు లేదా హైబీపీ.ప్ర‌పంవ్యాప్తంగా కోట్ల మందిని బాధిస్తున్న స‌మ‌స్య ఇది.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, ఒత్తిడి, శారీర‌క శ్ర‌మ లేక పోవ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, అధికంగా ఉప్పు తీసుకోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల అధిక ర‌క్త పోటు బారిన ప‌డుతుంటారు.

అయితే అధిక ర‌క్త పోటును కంట్రోల్ చేయ‌డంలో బార్లీ పిండి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

భూమిపై మొట్టమొదటిగా పండించిన ధాన్యాలలో బార్లీ ఒక‌టి.బార్లీ గింజ‌ల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫాస్సర‌స్‌, ఐర‌న్‌, జింక్‌, మాంగ‌నీస్‌, విట‌మిన్ ఎ, విమ‌టిన్ బి, విట‌మిన్ ఇ, ఫైబ‌ర్‌, ప్రోటీన్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

అందుకే బార్లీ గింజ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

ముఖ్యంగా అధిక ర‌క్త పోటుతో బాధ ప‌డే వారు బార్లీ గింజ‌ల‌తో పిండి త‌యారు చేసుకుని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే.

అందులో ఉండే ప‌లు పోష‌కాలు ర‌క్త పోటు స్థాయిల‌ను సూప‌ర్‌గా కంట్రోల్ చేస్తాయి.

"""/"/ మ‌రియు ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి.మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

దాంతో గుండె పోటు, ఇత‌ర సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే బార్లీ పిండిని త‌ర‌చూ తీసుకుంటే హైబీపీ కంట్రోల్ అవ్వ‌డ‌మే కాదు.

శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.చ‌ర్మం ఎప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతి వంతంగా మెరుస్తుంది.

మూత్ర‌నాళ ఇన్ఫెక్ష‌న్‌తో బాధ ప‌డే వారు రోజు బార్లీ పిండితో త‌యారు చేసే జావ తీసుకుంటే చాలా మంచిది.

బార్లీలో ఉండే పోషకాలు ఇన్ఫెక్ష‌న్‌ను నివారించి.మూత్ర‌నాళ మార్గాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి.

ఇక బార్లీ పిండిని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

వెయిట్ లాస్ కూడా అవుతారు. .

ఆ హిట్ సాంగ్‌ను చిరంజీవి కొరియోగ్రాఫ్ చేశారనే సంగతి మీకు తెలుసా..??