వైరల్ వీడియో: బయట పులి.. ఇంట్లో పిల్లి అంటే ఇదే కాబోలు..!
TeluguStop.com
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే బాగా ట్రెండింగ్ గా మారాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు నవ్వకుండా అసలు ఉండలేరు.వీడియో గురించి చెప్పే ముందు మీకు ఒక సామెత గురించి చెప్పాలి.
అది ఏంటంటే కొంతమంది వీధిలోకి వెళ్ళినప్పుడు పులి లాగా మారిపోయి అది చేస్తా.
ఇది చేస్తా.అని ప్రగల్బాలు పలుకుతారు.
తీరా ఇంటికి వచ్చాక సైలెంట్ అయిపోతారు.అంటే వీధిలో పులి.
ఇంట్లో పిల్లిలాగా అన్నమాట.సరిగ్గా వీడియోలో కనిపించే కుక్క కూడా అంతే అన్నమాట.
సాధరణంగా కుక్కలు ఇంటికి కాపలా కాస్తూ బయట వాళ్ళు ఎవర్ని లోపలికి రానివ్వకుండా అరుస్తూ ఉంటాయి.
దాన్ని అరుపులు చూసిన ఎవరయినా సరే భయపడి పోతారు కదా.కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కుక్కలు కట్టేసినప్పుడు, మనుషులు దూరంగా ఉన్నప్పుడు మనల్ని భయపెడతాయి.
అదే వాటి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు కొన్ని కుక్కలు భయపడిపోతాయి.అంటే దూరంగా ఉన్నప్పుడు ఒకలా.
దగ్గరగా ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తాయి అన్నమాట.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలోని ఒక పెంపుడు కుక్క కూడా అంతే దూరం నుంచి రెండు కోళ్లను చూసి మొరుగుతూ ఉంటుంది.
కుక్కకి, రెండు కోళ్ళకి మధ్య అడ్డుగా ఒక రెయిలింగ్ గేట్ కూడా ఉంటుంది.
గేటుకు ఒక పక్క ఉన్న కుక్క ఆ కోళ్లను చూసి వాటిని దొరికితే తినేయాలి అనే కసిగా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది.
"""/" /
అది గమనించిన ఒక అమ్మాయి ఆ కుక్కను ఎత్తుకుని రెయిలింగ్ గేట్ కు అటువైపు ఉన్న కోళ్ల దగ్గర వదిలిపెడుతుంది.
అంతే సింహంలా గర్జించిన ఆ కుక్క ఒక్కసారిగా తోకముడిచి పిల్లిలా మారిపోయింది సైలెంట్ అయిపోతుంది.
బిక్క ముఖం పెట్టి నన్ను ఈ కోళ్ల చెర నుండి తప్పించండి మహాప్రభో అంటూ రేయిలింగ్ గేట్ ను పట్టుకుని ప్రాథేయపడుతుంది.
ఈ వీడియోను చుసిన నెటిజన్లు చాలా ఫన్నీగా ఉందని మునుపెన్నడూ ఇలాంటి ఫన్నీ వీడియోను చూడలేదని కామెంట్స్ పెడుతున్నారు.
ఈ వీడియోను చూసాక మనసారా నవ్వుకున్నాం అని చాలామంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.