నాన్ లోకల్ అస్త్రాన్ని బయటకు తీస్తున్న బారాస?

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాంతీయ అస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించి ఫలితం అందుకున్న బారాస గత రెండు పర్యాయాలుగా ఆ అస్త్రాన్ని మూలన పెట్టింది .

నీళ్ళు, నియామకాలు , నిదులు ప్రాతిపదికన జరిగిన తెలంగాణ ఉద్యమం లక్ష్యం సాదించాక ఇక ఆ అస్త్రాన్ని వాడాల్సిన అవకాశం బారాస కి రాలేదు తెలంగాణ సిద్ధించడంతోపాటు పూర్తిస్థాయి స్వపరిపాలన అందించే అవకాశం తమకే దక్కడం తో విభజన రాజకీయాలకు బారాస స్వస్తి చెప్పింది .

"""/" / అయితే మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని, ప్రాంతీయ విద్వేషాలతో జాతీయ సమైక్యతను నీరుగార్చారని కెసిఆర్ పై భారీ ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ పార్టీ ఉద్యమ ఊపులో అవేమీ పట్టించుకోలేదు.

అయితే గద్దెనెక్కిన తర్వాత మాత్రం ఆ తేడా చూపించకుండా పరిపాలన సాగించిందని విశ్లేషణలు వచ్చాయి.

ముఖ్యంగా తెలంగాణలో నివసించే వారందరూ తెలంగాణ బిడ్డలే అంటూ స్వరం మార్చింది అయితే మరోసారి నాన్ లోకల్ ఆస్త్రం తాలూకా అవసరం ఆ పార్టీకి వచ్చినట్టుగా కనిపిస్తుంది, ముఖ్యంగా షర్మిల,కే‌వి‌పి రామచంద్ర రావు లాంటి వారు కాంగ్రెస్లో తిరిగి యాక్టివ్ కావడం, బజాపా లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ ఆక్టివ్ కావడం తో మరోసారి తెలంగాణపై ఆంధ్ర పార్టీలు పెత్తనం చేస్తున్నాయని స్లోగన్ను బారాశా జాతీయ కార్యదర్శి కేటీఆర్( Kalvakuntla Taraka Rama Rao ) ఎత్తుకున్నారు.

"""/" / కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఎలానో తెలుగుదేశం బ్రాండ్ కాబట్టి ఈ ఆరోపణ తమకు రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుందని బారాసా నమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది.

గత దశాబ్ద కాలంగా స్వపరిపాలన సాగుతున్న తెలంగాణలో ఈ ఆంధ్ర అంశం ఏ మేరకు బారసాకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ తమ కు అచ్చి వచ్చిన అస్త్రాన్ని మరోసారి ప్రయోగించడంలో తప్పేముంది అన్నట్టుగా బారసా వైఖరి ఉన్నట్టుగా తెలుస్తుంది .

అయితే రెండు పర్యాయాలుగా పరిపాలిస్తున్న తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను ప్రస్తావించి ఓట్లు అడగాలే తప్ప ఇప్పటికే అవుట్ డెటెడ్ అయిపోయిన ఆస్త్రాన్ని పట్టుకొని ముందుకు వెళ్లాలని భారతీయ రాష్ట్ర సమితి భావించడం అంత తెలివైన ఎత్తుగడ కాదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పిరమిడ్స్ ఎలా కట్టారో వివరించిన ఎన్నారై రీసెర్చర్..?