ఊహాగానాలకు తెర.. కమలా హారిస్‌కు మద్ధతు ప్రకటించిన ఒబామా దంపతులు
TeluguStop.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల( US Presidential Election ) నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు మౌనం వీడారు.
డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు వారు మద్ధతు తెలిపారు.
జో బైడెన్ అభ్యర్ధిత్వాన్ని ఇష్టపడని మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా.ఆయన పోటీ నుంచి తప్పుకుంటేనే మంచిదని సన్నిహితుల వద్ద ప్రస్తావించారు.
కానీ డెమొక్రాటిక్ పార్టీ నుంచి ఎవరు అధ్యక్షుడైతే బాగుంటుందనే దానిపై మాత్రం ఒబామా క్లారిటీ ఇవ్వలేదు.
అయితే కమలా హారిస్ అధ్యక్ష రేసులో నిలవడం ఆయనకు ఇష్టం లేదంటూ అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఆమె అభ్యర్ధిత్వం విషయంలో డెమొక్రాట్ నేతలు ఏదో రకంగా స్పందించారు.కానీ ఒబామా మాత్రం ఇప్పటి వరకు కమలా హారిస్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం చర్చనీయాంశమైంది.
"""/" /
అధ్యక్ష పదవికి కమలా హారిస్ స( Kamala Harris )మర్ధురాలు కావడం లేదని మాజీ అధ్యక్షుడు భావిస్తున్నారని, సవాళ్లను దాటి ముందుకెళ్లడం కష్టమైన పనేనని ఒబామా అభిప్రాయపడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
ఆమె స్థానంలో అరిజోనా సెనెటర్ మార్క్ కెల్లీని అధ్యక్ష అభ్యర్ధిగా ఎంచుకుంటే బెటరనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తన అభిప్రాయాలు, ఉద్దేశాలను త్వరలో జరగనున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో బరాక్ ఒబామా( Barack Obama ) వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంతలో ఊహాగానాలకు తెరదించుతూ ఒబామా దంపతులు హారిస్‌తో ఫోన్‌లో మాట్లాడారు, దీనికి సంబంధించిన వీడియోను బరాక్ ఒబామా షేర్ చేశారు.
తాను, మిషెల్ కొద్దిరోజుల క్రితం కమలా హారిస్‌కు ఫోన్ చేశామని.ఆమె అమెరికా అధ్యక్షురాలు అవుతారని భావిస్తున్నామని , కమలా హారిస్ గెలవడానికి ఏమైనా చేస్తామని ఒబామా చెప్పారు.
/br> """/" /
మరోవైపు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధికారికంగా ప్రకటించారు.
దీనికి సంబంధించిన దరఖాస్తుపై ఆమె సంతకం చేశారు.ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని.
అన్ని ఓట్లూ దక్కించుకునేందుకు కృషి చేస్తానని కమల తెలిపారు.
గేమ్ ఛేంజర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు.. అలా చెప్పి షాకిచ్చారుగా!