రూ.12 లక్షలతో తీస్తే రూ.2 కోట్లు కలెక్ట్ చేసిన బాపు సినిమా.. ఏదంటే..??

డైరెక్టర్ బాపు( Director Bapu ) సినిమాలకు, రామాయణానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది.

ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ముత్యాలముగ్గు (1975) సినిమాలో( Muthyala Muggu ) కూడా రామాయణం మనకు కనిపిస్తుంది.

నిజానికి ఈ మూవీ టైటిల్స్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ శ్రీరామ జయరామ సీతారామా అనే పాటతో రోల్ అవుతాయి.

బాపు ఈ పాటతో చాలామందిని ఆకట్టుకున్నాడు.శంకరాభరణం సినిమా కె.

విశ్వనాథ్ కు ఎంత పేరు తెచ్చిపెట్టిందో, బాపుకు ఈ ముత్యాలముగ్గు సినిమా కూడా అంతే మంచి పేరు తెచ్చి పెట్టింది.

బాపు అనగానే ఈ ముత్యాలముగ్గు సినిమానే అందరికీ గుర్తొచ్చేది.ఈ సినిమాని చూస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి.

సినిమా తీసే విధానం, కథ, నటన ఇలా ప్రతి విషయం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ఈ మూవీ ప్రస్తుత దర్శకులకు ఒక కేసు స్టడీగా నిలుస్తుందని అనడంలో సందేహం లేదు.

ఇందులో నటీనటులు మేకప్ కూడా వేసుకోకుండా చాలా సహజంగా కనిపించారు.అందుకే ఈ మూవీ చాలా స్పెషల్‌గా మారింది.

"""/" / ముత్యాలముగ్గు మూవీ చాలా మంది నటుల కెరీర్‌కు మంచి బాట వేసిందని చెప్పొచ్చు.

ముఖ్యంగా, ఈ సినిమాతోనే తొలిసారిగా నటించిన నటి సంగీతకు( Sangeetha ) చాలా మంచి పేరు వచ్చింది.

ఇందులో రావు గోపాలరావు( Rao Gopalarao ) వేసిన కాంట్రాక్టర్ వేషం బాగా హైలైట్ అయింది.

ఆయనతో పాటు మాడా, కాకరాల, ముక్కామల, అల్లు రామలింగయ్య నటించిన పాత్రలు కూడా చాలా బావుంటాయి.

ముఖ్యంగా, ముళ్లపూడి వెంకటరమణ( Mullapudi Venkataramana ) రాసిన డైలాగ్‌లు ఎంతో మెప్పించాయి.

నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ నిత్య పెళ్లి కొడుకుగా నటించి బాగా పేరు తెచ్చుకున్నాడు.

ముత్యాలముగ్గులో బేబీ రాధ, మాస్టర్ మురళి, ఆర్జా జనార్ధనరావు, ఆంజనేయస్వామి లాంటి చాలా మంది నటులు తమ పాత్రల మేరకు బాగా నటించారు.

"""/" / కె.వి మహదేవన్ ఈ సినిమాలోని పాటలను కంపోజ్ చేశాడు.

ఆరుద్ర లిరిక్స్ అందించాడు.ఇందులో ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయా ఎవర్ గ్రీన్ హిట్ అయింది.

గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన నిదురించే తోటలోకి పాట కూడా హిట్ అయింది.

సి నారాయణరెడ్డి సాహిత్యం అందించిన గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మడి , ఎంతటి రసికుడివో తెలిసెరా పాటలు కూడా తెలుగువారిని బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ఔట్‌డోర్ షూటింగ్ గోదావరి , కోనసీమ , కలిదిండి గ్రామంలో జరిగింది.

ప్రముఖ రచయిత ఎమ్వీయల్ నరసింహారావు ఈ మూవీని 12 లక్షల బడ్జెట్ తో నిర్మించారు అయితే ఈ సినిమా రూ.

2 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.హైదరాబాద్ , విశాఖపట్నం , విజయవాడ , తిరుపతి , రాజమహేంద్రవరం కేంద్రాలలో 25 రోజులు, 12 సెంటర్లలో 100 రోజులు ఆడింది.

హిందీలో జీవనజ్యోతి టైటిల్ తో రీమేక్ అయిన సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది.

భారతీయులను దారుణంగా అవమానించిన కెనడియన్.. వీడియో వైరల్..