చిరంజీవి-బప్పిల హరి కాంబోలో చార్ట్ బస్టర్ సాంగ్స్..
TeluguStop.com
బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు బప్పిలహరి కన్నుమూశాడు.ఎన్నో అద్భుత సినిమాలకు సంగీతం అందించిన ఆయన.
అనారోగ్యంతో చనిపోయారు.బప్పిలహరికి తెలుగు సినిమా పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉంది.
ఆయన సంగీతం అందించిన అగ్రహీరోల సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.అంతేకాదు.
ఆయన ఆయా సినిమాల్లో పాడిన పాటలు జనాల మదిలో నిలిచిపోయాయి.సంగీతం, పాటలు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాయి.
బప్పిలహరి మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు సినిమాలకు పనిచేశారు.వాస్తవానికి టాలీవుడ్ లో చిరంజీవి సినిమా అంటేనే అదరిపోయే స్టెప్పులు ఉంటాయి.
ఆయన పాటలకు జనాలు లేచి డ్యాన్సులు చేస్తారు.ఆయన కొత్త సినిమాల పాటలు ఎప్పుడు వస్తాయా? అని అప్పట్లో చాలా మంది ఎదరు చూసే వారు.
అలాంటి చిరంజీవి అభిమానులను ఇప్పటికీ అద్భుత పాటలతో కిక్కెక్కించాడు బప్పిలహరి.ఆయన సంగీతంలో వచ్చిన పాటలు జనాల మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.
చిరంజీవితో కలిసి ఆయన నాలుగు సినిమాలు చేశాడు.అందులో స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, బిగ్ బాస్ సినిమాలున్నాయి.
"""/" /
మెగాస్టార్, బప్పి కాంబోలో వచ్చిన ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.
స్టేట్ రౌడీలో తదిగిన తోం, రాధా రాధా మదిలోన మన్మధ బాధ, చుక్కల పల్లకిలో, వన్ టూ త్రీ అనే పాటలు అద్భుతంగా పేలాయి.
మెగా చార్ట్ బస్టర్ లిస్టులో ఈ పాటలు కచ్చితంగా ఉంటాయి.గ్యాంగ్ లీడర్ సినిమాలోని భద్రా చలం కొండా సీతమ్మ వారి దండ అనే పాట అప్పట్లో మార్మోంగింది.
వానా వాన వెల్లువాయె అనే పాట అప్పుడే కాదు.ఇప్పటికీ, ఎప్పటికీ జనాల నోళ్లలో నానుతూనే ఉంటుంది.
ఆయన అభిమానుల్లో మంచి కిక్ ఇచ్చిన పాట ఇది.చిరంజీవి తనయుడు కూడా ఈ పాటను రీమేక్ చేశాడు.
రౌడీ అల్లుడు మూవీలోని అమలాపురం బుల్లోడా, చిలుకా క్షేమమా, తద్దినకా.తప్పదికా పాటలు ఇప్పటికీ బ్లాక్ బస్టర్లుగానే ఉన్నాయి.
బిగ్ బాస్ లో మావా మావా అనే పాట అప్పట్లో సినిమా ప్రపంచాన్ని ఊపు ఊపింది.
కౌశిక్ తల్లి చెప్పిన కామెంట్లలో ఏ మాత్రం నిజం లేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్!