రాత్రికి రాత్రి వందేళ్ల మర్రి చెట్టు మాయం... ఇది ఎవరి పని అంటూ జుట్టు పీక్కుంటున్న పోలీసులు

బెంగళూరు నగరంలో వింతైన సంఘటన జరిగింది.నగరంలోని ముఖ్యమైన ప్రదేశంలో ఉండే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మర్రి చెట్టు రాత్రికి రాత్రి కనిపించకుండా పోయింది.

ఎంతో పెద్దది, అత్యంత విశాలమైన మొదలు కలిగిన మర్రి చెట్టును కొన్ని గంటల్లో పూర్తిగా తొలగించడం ఒక్కరు ఇద్దరితో అయ్యే పని కాదు.

కనీసం 50 మంది కలిస్తేనే ఆ చెట్టును పది గంటల్లో తొలగించగలరు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే అంత మంది అక్కడ పని చేస్తూ ఉంటే ఎవరు చూడకుండా ఎలా ఉంటారు చెప్పండి, ఖచ్చితంగా చూసే ఉంటారు.

ఆ సమయంలో ఫిర్యాదు ఇవ్వకుండా తెల్లవారిన తర్వాత చెట్టు నామ రూపాలు లేకుండా పోయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ చెట్టు కనిపించకుండా పోయిందనే ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.

100 ఏళ్ల చరిత్ర ఉన్న చెట్టు అవ్వడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్‌ అయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌ ఏరియాలో ఉన్న ఈ చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి తొలగించారు.

వారు ఎవరు అనే విషయమై కర్ణాటక మొత్తం చర్చ జరుగుతుంది.స్థానికుల సాయం లేకుండా ఖచ్చితంగా అంత పెద్ద చెట్టును రాత్రికి రాత్రి కూల్చి వేయడం అంటే మామూలు విషయం కాదు.

స్థానికులు వారికి సాయం చేయడం వల్లే అది సాధ్యం అయ్యిందంటున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఆ చెట్టు వల్ల స్థానికులకు నీడ దొరుకుతుంది నిజమే కాని, ఆ చెట్టు వల్ల కొన్ని సమస్యలు కూడా సదరు స్థానికులు ఎదుర్కొంటున్నారు.

అందుకే వారు గుట్టు చప్పుడు కాకుండా ఆ చెట్టును తొలగించేందుకు ముందుకు వచ్చారని, ఆ చెట్టు లేకపోతే చాలా విశాలమైన ప్లేస్‌ కూడా కలిసి వస్తుందని వారు భావించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

చెట్టును తొలగించడంలో స్థానికుల పాత్ర ఎంత అనే విషయమై చర్చ జరుగుతుంది.పోలీసులకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త దీనిని జాతీయ స్థాయిలో తీసుకు వెళ్తాను అంటున్నాడు.

దాంతో బెంగళూరు పోలీసులు ఈ కేసులో సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అంత భారీ చెట్టును నరికి వేస్తున్న సమయంలో స్థానికులు అంతా కూడా నిద్ర పోతున్నామని చెబుతున్నారు.

ఆ సమయంలో అంతా కూడా నిద్ర పోతున్నాం, లేచి చూసేప్పటికి చెట్టు కనిపించడం లేదు అంటూ స్థానికులు అంతా కూడా ఒకే మాటమీద ఉన్నారు.

వారు చెప్పేది నిజమేనా, కాదా అనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

ఇంతకు ఆ మర్రి చెట్టును ఎవరు కొట్టి వేసినట్లో.? Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ .

ప్రతిక్షణం నా కోసం నిలబడ్డాడు.. భర్త పై ఇలియానా ఎమోషనల్ కామెంట్స్?