రాజస్థాన్, గుజరాతీలతో లోకల్ వ్యాపారులు దివాలా

నల్లగొండ జిల్లా: పూర్వంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఆంగ్లేయులు చింతపండు అమ్మడానికి వచ్చి మన దేశంలో పాతుకుపోయి భారతదేశాన్ని వారి ఆధీనంలో తీసుకొని రాజ్యమేలి చరిత్ర గతినే మార్చిన సంగతి మరిచినా మరువలేని ఘట్టంగా మిగిలిపోయే.

అచ్చం అలాగే అప్పుడు ఈస్ట్ ఇండియా ఇప్పుడు నార్త్ ఇండియా వ్యాపారం పేరుతో ఎగబడి పోతున్నారు.

అందులో ముఖ్యంగా గుజరాతీ వాళ్ళ మాల్స్,రాజస్థానీ వాళ్ళ షాప్స్ పెద్ద పెద్ద నగరాలను దాటి చిన్న చిన్న పట్టణాలకు వ్యాపించాయి.

దీనితో మన వాళ్ళు సోకేజీలు చూసి ఎగబడి కొంటున్నారు.దీనితో ఏళ్ల తరబడి వ్యాపారాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న చిన్నా,పెద్దా లోకల్ వ్యాపారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారు ఇక్కడ పాతుకుపోకుండా చూడాల్సిన భాద్యత మన అందరి మీద ఉందని,ఇక్కడి వ్యాపారుల పొట్టకొడుతున్న గుజరాతీలు, రాజస్థానీలను అలాగే వదిలేస్తే, ప్రభుత్వం,ప్రజలు కళ్లు తెరవకపోతే పూర్తిగా నాశనమే జరుగుతుందని కొందరు వ్యాపారస్తులు నెత్తి నోరు బాదుకుంటున్నారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎటుచూసినా రాజస్థాన్ వ్యాపారుల హవా కనిపిస్తుంది.స్వీట్ బండితో నల్గొండలోకి రంగ ప్రవేశం చేశారు.

నల్లగొండలో ప్రధాన వ్యాపార కూడళ్లతో పాటు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్నీ మండల కేంద్రాల్లోనూ రెడీమేడ్,ఎలక్ట్రానిక్ షాప్స్, ప్లంబింగ్ షాప్స్,టీ షాప్స్,బైక్ మరియు ఆటో స్పేర్ షాప్స్, పెయింట్ షాప్స్,ఫాన్సీ షాప్స్, వుడ్ వర్క్ షాప్స్,మొబైల్ షాప్స్,గిఫ్ట్ షాప్స్,బెకెరీ షాప్స్, చాట్ బండి,స్వీట్ షాప్స్ పేపర్ అండ్ గ్లాస్ షాప్స్,గ్లాస్ వర్క్ షాప్స్ ఇలా అన్ని దుకాణాలు పెట్టేసి రెండు చేతులా మన డబ్బును కొల్లగొడుతున్నారు.

మన వ్యాపారులు నిద్రపోతుండగా,రాజస్థానీలు మాత్రం తమ వ్యాపార సామ్రాజ్యన్ని విస్తరిస్తూ అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర వ్యాపారాలను శాసించే స్థాయికి చేరారంటే అతిశయోక్తి కాదేమో.

వ్యాపారాలను 60 శాతం మించి వారు కైవసం చేసుకుంటున్నారు.మార్వాడి వ్యాపార రహస్యం ఏమిటంటే బడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అన్నీ కూడా మార్వాడి వాళ్ళవే.

మార్వాడి వాళ్ళకి ఇచ్చిన రేటుకు మన వ్యాపారస్తులకు ఇవ్వనే ఇవ్వరు.దాదాపు అన్ని వ్యాపారాలలో వాళ్ళు పాతుకుపోయారు.

వారి వల్ల స్థానిక వ్యాపారులకు ఆర్థికంగా దెబ్బతిన్నారు.నాసిరకం వస్తువులు అతి తక్కువ ధరకు ఇస్తున్నారు.

కంపెనీ ఐటమ్స్ అని చెప్పి డూప్లికేట్ ఐటమ్స్ తక్కువ ధరకు ఇస్తున్నారు.ఇలా కొనసాగితే కొన్నాళ్ళకు మార్వాడి సేట్ల దగ్గర బానిసలాగా బతికే రోజు దగ్గర్లోనే ఉందనేది పలువురు లోకల్ వ్యాపారుల వాదన.

మన స్థానిక వ్యాపారస్తులు దగ్గర కొంటె వచ్చిన లాభం ఇక్కడే ఖర్చు చేస్తారు.

రాజస్థాన్ వాళ్ళు అలా కాదు, ఇక్కడ సంపాదించి,ఇక్కడ డబ్బంతా వాళ్ళ వాళ్ళ ఊర్లకి తరలిస్తారు.

ఇక్కడి డబ్బుతో వాళ్ళ ఊర్లు డెవలప్ చేసుకుంటారు.ప్రతి ఐటెం నార్త్ లో తయారు చేస్తారు,వాళ్లకు హోల్ సేల్ రేట్ చాలా తక్కువగా ఇస్తారు,అదే ఐటమ్స్ మన వ్యాపారస్తులకు ఎక్కువ రేట్ కి ఇస్తారు.

రాజస్థాన్ వాళ్లకు ఇచ్చిన రేట్ కి మన వ్యాపారస్తులకు ఇవ్వరు.మన స్థానిక వ్యాపారస్తుల గురించి ఒక్కసారి ఆలోచిచండి అంటూ తెలంగాణ వ్యాపారస్తులు ప్రభుత్వాన్ని,ప్రజలను వేడుకుంటున్నారు.

స్థానిక వ్యాపారస్తులను బతికించాలని ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా విఫలమవుతుండటంతో ఏమి చేయలేక వ్యాపారం జరగక, వ్యాపారం కోసం చేసిన అప్పులు కట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

కొంతమంది ఏమి అనలేక ఏమి చేయలేక ఆవేదనకు గురవుతున్నారు.ఎవరి ఇష్టం వాళ్ళది,ఎవరు ఎక్కడైనా కొనే స్వాతంత్రం ఉంది.

కానీ,కొనే ముందు ఒకసారి ఆలోచించండి అంటూ వ్యాపారస్తులు తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నారు.నల్లగొండలో మార్వాడి మాఫియాను కట్టడి చేస్తామని నూతనంగా నల్లగొండ మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నంద్యాల నరేందర్ రెడ్డి అంటున్నారు.

మార్వాడి వ్యాపారస్తుల ఆగడాలు మితిమీరి పోయాయి.హోల్సేల్,రిటైల్ రంగాలలో నాణ్యతలేని వస్తువులు అమ్ముతూ ప్రజలను మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారు.

నల్లగొండలో పెత్తనం చెలాయించడంపై కట్టడి చేస్తాం.ఏండ్లుగా ఇక్కడే ఉండి ప్రమోటర్లుగా పనిచేస్తున్న వారికి గుర్తింపు ప్రమోషన్లు ఉండటం లేదు.

వీరిపై వరంగల్ మాఫియా గాళ్లు చెప్పింది వేదంగా నడుస్తుంది.వారిని కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.

లోకల్ వ్యాపారస్తులకు లాభం చేకూరేలా,ప్రజలకు నాణ్యమైన సరుకులు బ్రాండెడ్ ఐటమ్ అతి తక్కువ ధరలకే ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

మార్వాడి వారు హోల్సేల్ వ్యాపారం మాత్రమే చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి యూనియన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని చెబుతున్నారు.

లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గర భారతీయుల సమోసా, జిలేబీ పార్టీ.. వీడియో వైరల్..