బ్యాంకు అధికారినంటూ ఏకంగా ఓ వ్యక్తికి రూ. 11 లక్షలు టోకరా …!

ఓ మహిళ బ్యాంకులో పని చేస్తున్నాను అంటూ ఓ వ్యక్తిని నమ్మించి ఏకంగా 11 లక్షల రూపాయలు దోచుకుంది.

ఈ సంఘటన తెలంగాణలో నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో జరిగింది.ఈ విషయం సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

సదరు మహిళ ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో ఓ బ్యాంకులో పని చేస్తున్నా అంటూ మెసేజ్ పంపుతూ ఆయనతో పరిచయం పెంచుకుంది.

ఈ పరిచయంతో చిట్యాల పట్టణ కేంద్రానికి చెందిన లక్ష్మణ్ రావు తన పూర్తి వివరాలను ఆమెకు తెలియజేశాడు.

దీంతో ఓ రోజు తాను పనిచేసే బ్యాంకులో వ్యక్తి మరణించాడని అతని బ్యాంకు అకౌంట్ లో ఉండే 9600 మిలియన్ డాలర్లను డ్రా చేసుకునేందుకు సహకరించాలని లక్ష్మణ్ రావు ని ఆవిడ కోరింది.

దీని పక్షంలో ఆ విషయాన్ని ఆమెకు సహకరించేందుకు అంగీకరించాడు.అయితే ఇందుకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేందుకు వారి బ్యాంకు లోనే అకౌంట్ ఓపెన్ చేయాలని, అందుకోసం 96 వేల రూపాయలను పంపాలని కోరింది.

ఇలా ఆ తర్వాత కొన్ని దఫాలు లక్ష్మణ్ రావు నుండి ఆ మహిళకు ఏకంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు పంపించాడు.

ఇదిలా ఉంటే మరోవైపు మార్చి నెల లో మరో మహిళ లండన్ లో ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి ఇండియాలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావిస్తున్నట్లు ఆయనతో చాటింగ్ చేసింది.

అయితే ఈ వ్యాపార క్రమంలో లక్ష్మణ్ రావు తనకు ఐదు లక్షలు తనకి డబ్బులు పంపమని ఆడగా ఆ మహిళ డబ్బులు పంపిస్తానని, అయితే బ్యాంకు ఖాతా ద్వారా పంపితే ఇబ్బందులు వస్తాయని తెలిపింది.

అయితే అందుకు సంబంధించిన కస్టమ్ చార్జీలు చెల్లించమని ఆమె తెలిపింది.దీనితో సరే అన్న ఆ వ్యక్తికి కొన్ని రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్ ఆఫీసర్స్ నుంచి ఫోన్ వచ్చినట్లు నమ్మించి మొదటగా రూ.

40 వేల రూపాయలు తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తే పార్సల్ మీ ఇంటికి వస్తుంది అని నమ్మించారు.

"""/"/ ఆ తర్వాత మళ్లీ పార్సల్ రాకపోయేసరికి మళ్లీ ఫోన్ చేసి అడగగా అందులో విలువైన ఆభరణాలు ఉన్నాయని అందుకోసం మరో మూడు లక్షల రూపాయలు పంపిస్తే పార్సల్ మీ వద్దకు వస్తుందని, లేకపోతే ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పడంతో.

ఆ డబ్బులు కూడా బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారు.ఇక అంతే ఆ తర్వాత సదరు మహిళకు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది.

తాను మోసపోయానని గ్రహించిన లక్ష్మణ్ రావు ఏకంగా 11 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు.

దీంతో పోలీసు అధికారులకు పూర్తి విషయాన్ని తెలిపారు.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..