ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో విద్యానగర్ లో
గ్రీన్ క్లబ్ ట్రస్ట్,పట్టణ వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ఆదివారం మార్నింగ్ వాక్ లో ప్రజలకు ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం విద్యానగర్,గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్,బ్లూసిహోటల్,శంకర్ విలాస్ సెంటర్,గండూరి బ్రదర్స్ షాపింగ్ ఏరియా,మసీదు ఏరియా,ఎంజి రోడ్ గాంధీ విగ్రహం ప్రాంతాలలో వాహనదారులకు,దుకాణదారులకు చేతి సంచుల వినియోగంపై అవగాహన కల్పించి,చేతిసంచులను పంపిణీ చేశారు.
చేతిసంచి పర్యావరణానికి మంచిదనే పేరుతో స్టిక్కర్లను దుణాకాల,గృహ సముదాయాల వద్ద అతికించారు.ఈ సందర్భంగా పట్టణ వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్,టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ,గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ
చేతి సంచి పర్యావరణానికి మంచిదనే నినాదంతో
గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజలను చైతన్య పరుస్తున్నాయని అన్నారు.
ప్రజలు తమ నిత్యావసర వస్తువుల కొనుగోలు సమయంలో ప్లాస్టిక్ కవర్లకు బదులుగా చేతి సంచులు వాడాలని, ప్రతి ఒక్కరూ మార్కెట్ కు చేతిసంచితో వెళ్లడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కోరారు.
మార్నింగ్ వాక్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం ద్వారా మంచి స్పందన వస్తుందని అన్నారు.
ప్లాస్టిక్ కవర్లు,ప్లాస్టిక్ ఉత్పత్తులు డ్రెయినేజీ కాలువల యందు,నాలాలలో చేరి వాననీరు పోకుండా అడ్డుపడి,వరద పరిస్థితికి కారణమవుతున్నాయన్నారు.
ప్లాస్టిక్ వినియోగం వలన పర్యావరణం దెబ్బతిని,మానవులతో పాటు మూగ జీవాలు కూడ బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడానికి పట్టణంలోని మేధావులు,విద్యావేత్తలు,వ్యాపారులు మందుకు రావాలని పిలుపునిచ్చారు.సూర్యాపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేయగా,చేతి సంచుల వాడకానికి ప్రజలు తమ మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సెక్రటరీ డాక్టర్ తోట కిరణ్,కోశాధికారి ఉప్పల శ్రవణ్,సభ్యులు ముప్పారపు నాగేశ్వరరావు,బహురోజు ఉపేంద్రాచారి,కృష్ణమూర్తి, రవి శంకర్,డాక్టర్ సుధీర్ కుమార్,సోమ హేమమాలిని,వందనపు శ్రీదేవి,అనంతుల సువర్ణలక్ష్మి,యామ రజని,కె.
సంపత్ కుమార్,తోట అలేఖ్య,ముప్పారపు విద్యాసాగర్,తల్లా రామచంద్రయ్య,కిరణ్ కుమార్,వెంకటేశ్వర్లు,45 వ వార్డు కమిటీ సభ్యులు కుక్కడపు సాలయ్య,భిక్షం, వెంకటేష్,కళ్యాణ్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
లోకో-పైలట్ ప్రేమలో యూకే మహిళ.. దీని వెనుక హార్ట్‌టచింగ్ స్టోరీ..?