గోనె సంచిలో నటి శవం.. విచారణలో పోలీసుల కామెంట్స్ వైరల్!
TeluguStop.com
బంగ్లాదేశ్ కు చెందిన నటి రైమా ఇస్లాం ఇటీవలే కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
కనిపించకుండా పోయిన ఈమె తాజాగా శవమై తేలింది.ఈమె గోనెసంచిలో శవమై తేలిన ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.
బంగ్లాదేశ్ కు చెందిన నటి రైమా ఇస్లాం షిము మృతదేహం ఒక బ్రిడ్జి పక్కన గోనే సంచిలో కనిపించింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమె భర్త ను అదుపులోకి తీసుకొని విచారించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.బంగ్లాదేశ్ కు చెందిన నటి రైమా ఇస్లాం 1998లో బర్తమాన్ అనే సినిమాతో తన కెరిర్ ను మొదలుపెట్టింది.
ఆ తర్వాత ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా వెండితెరపై కూడా దాదాపుగా 25 సినిమాలలో నటించింది.
అలాగే బుల్లితెరపై ప్రసారం అయ్యే పలు సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.
అయితే కేవలం సీరియల్స్ లో నటించడమే కాకుండా పలు సీరియల్స్ నిర్మించింది.ఈ విధంగా అటు వెండి తెరపై బుల్లితెరపై నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది రైమా ఇస్లాం.
ఇది ఇలా ఉంటే కొద్దిరోజుల క్రితం ఈమె కనిపించకుండా పోయింది.ఇక తన భార్య కనిపించడం లేదు అంటూ ఆమె భర్త షెకావత్ అలీ నోబెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జనవరి 16న మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.
ఇక అప్పటినుంచి ఆమె ఆచూకీ లభించలేదు. """/"/
కానీ తాజాగా దేశ రాజధాని ఢాకా లోని కెరాని గంజ్ సమీపంలో ఒక బ్రిడ్జి వద్ద ఒక గొనె సంచి కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇక వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ గోనెసంచిలో ఉన్నది నటి రైమా గా గుర్తించారు.
గోనెసంచిను తెరచి చూడగా ఆమె శరీరంపై గాయాలు కూడా కనిపించాయి.వెంటనే అనుమానం వచ్చిన పోలీసులు ఆమె భర్త ను అదుపులోకి తీసుకొని విచారించగా.
రైమా హత్యలో భర్త ప్రమేయం ఉన్నట్లు తేలింది.రైమా హత్యకు కారణం కుటుంబ కలహాలే అయి ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.
ఇక ఆమె హత్యకు కారణమైన ఆమె భర్త, అలాగే అతని స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఆమె హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ సింపుల్ రెమెడీతో పాదాలను తెల్లగా మృదువుగా మెరిపించుకోండి!