శ్రీలంక బాట‌లో బంగ్లాదేశ్..

రాజ‌కీయ అనిశ్చితి, పాల‌కుల ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి.

ఇప్ప‌టికే శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో దివాళా తీసిన సంగ‌తి తెలిసిందే.అటు భార‌త్ దాయాది దేశం పాక్ కూడా దివాళా అంచుల‌కు చేరుకుంది.

ఆ బాట‌లో మ‌రో దేశం బంగ్లాదేశ్ కూడా ప‌య‌నిస్తుంది.దిగుమ‌తుల‌కు చెల్లింపుల కోసం విదేశీ మార‌క ద్ర‌వ్యం నిల్వ‌లు నిండుకుంటున్నాయి.

ఈ క్ర‌మంలో వ‌చ్చే మూడేళ్ల‌లో 450 కోట్ల డాల‌ర్ల బెయిలౌట్ ప్యాకేజీ కోసం అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ తలుపు త‌ట్టింది.

కానీ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి ప‌థంలో ప్ర‌యాణిస్తున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో బంగ్లాదేశ్ ఒక‌టిగా ఉంది.

416 బిలియ‌న్ డాల‌ర్ల జీడీపీతో అంత‌ర్జాతీయంగా 33వ స్థానంలో కొన‌సాగుతుంది.