ఫెస్టివల్ తర్వాత సెట్స్ పైకి నాగార్జున బంగార్రాజు
TeluguStop.com
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరియర్ లో సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఇందులో నాగార్జున తండ్రి, కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశాడు.అయితే ఇందులో తండ్రి బంగార్రాజు పాత్ర ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యింది.
రొమాంటిక్ హీరోగా అందులో నాగార్జున తన పెర్ఫార్మెన్స్ తో ఇరగదీశాడు.ఇక ఈ బంగార్రాజు పాత్రని ఎలివేట్ చేస్తూ సోగ్గాడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తామని నాగార్జున అప్పట్లోనే చెప్పాడు.
సోగ్గాడే సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడుగా పరిచయం అయ్యాడు.తరువాత చైతూతో రారండోయ్ వేడుకచూద్దాం సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ నేల టికెట్ తో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు.
అయితే మళ్ళీ నాగార్జున బంగార్రాజు బాధ్యతలని కళ్యాణ్ కృష్ణకి అప్పగించారు.ఈ సినిమా స్క్రిప్ట్ పై పూర్తి స్థాయిలో వర్క్ చేయిస్తున్నారు.
లాక్ డౌన్ కి ముందే కథ ఫైనల్ అయ్యింది.సినిమా స్టార్ట్ చేయాలని అనుకునే సరికి కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ మొదలు కావడంతో ఆగిపోయింది.
అయితే ఈ సారి మాత్రం పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు. """/"/
తాజాగా నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ పూర్తి చేసేశాడు.
ఈ నేపధ్యంలో ఇప్పుడు బంగార్రాజు సినిమాపై దృష్టిపెట్టాడు.బంగార్రాజు చిత్ర షూటింగ్ జనవరి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఇక సింగిల్ షెడ్యూల్లో మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందని సమాచారం.
ఈ సినిమాలో బంగార్రాజు పాత్ర కొనసాగింపు ఉండటం వలన రమ్యకృష్ణ మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది.
ఇక సినిమాలో నాగ్ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ ఉంది.
ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
యూకే: శృంగార సమయంలో చేసిన పొరపాటుకు ప్రియురాలు మృతి..!