రేవ్ పార్టీపై బెంగళూరు సీపీ బి. దయానంద్ వ్యాఖ్యలు

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీపై సీపీ బి.దయానంద్( CP B.

Dayanand ) కీలక వ్యాఖ్యలు చేశారు.సన్ సెట్ టూ సన్ రైజ్ విక్టరీ పేరుతో పార్టీ నిర్వహించారని తెలిపారు.

రేవ్ పార్టీతో( Rave Party ) 101 మంది పాల్గొన్నారని సీపీ దయానంద్ పేర్కొన్నారు.

రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారన్న ఆయన పార్టీలో డ్రగ్స్( Drugs ) పట్టుబడ్డాయని చెప్పారు.

పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు.పార్టీలో ఒక నటి కూడా ఉన్నారన్న సీపీ వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమని చెప్పారు.

పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ సేకరించామని సీపీ తెలిపారు.ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందన్నారు.

ఐదుగురిపై కేసు నమోదు చేశామన్న ఆయన రేవ్ పార్టీపై ఇంకా విచారణ జరుగుతోందని తెలిపారు.

వీడియో వైరల్‌: దటీజ్ నీతా అంబానీ.. కన్యాదానం ప్రాముఖ్యత ఎమన్నా చెప్పిందా..