బైక్ పై కుర్రాడి స్పీడ్ కి పోలీసులే పరేషాన్ అయ్యారు

ఈ జెనరేషన్ యూత్ ప్రతి విషయంలోను వేగం చూపిస్తున్నారు.జీవితం నుంచి వెహికల్స్ వరకు అన్నిచోట్ల వేగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే ఈ వేగం ఒక్కోసారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది.వారి చేతికి బైక్ దొరికితే వేగం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టం.

వేగం పెరుగుతున్న కొద్ది వారికి ఉత్సాహం పెరుగుతుంది.దీంతో మరింత రెట్టించిన వేగంతో రహదారుల మీద దూసుకుపోతూ ఉంటారు.

ఇప్పుడు అలాంటి వేగంతో బెంగుళూరులో ఓ యువకుడు పోలీసులకి షాక్ ఇచ్చాడు.స్మార్ట్ బైక్ చేతిలో ఉండటంతో అత్యంత వేగంగా బండిపై దూసుకుపోవడమే కాకుండా తలకి కెమెరా పెట్టుకొని ఆ వేగాన్ని రికార్డ్ చేశాడు.

అయితే ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో వారు అతడిని అరెస్ట్ చేశారు.

ఇక ఆ యువకుడు కెమెరాలో రికార్డ్ చేసిన బైక్ స్పీడ్ కి సంబందించిన సంబంధించిన వీడియోను బెంగళూరు క్రైమ్ విభాగంలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న సందీప్ పాటిల్ ట్విట్టర్ లో పంచుకున్నారు.

బైకర్ తన హెల్మెట్ కు కెమెరా అమర్చుకుని తన సూపర్ రైడ్ ను రికార్డు చేశాడు.

యమహా 1000 సీసీ బైక్ రోడ్డుపై రివ్వున సాగిపోతుంటే స్పీడోమీటర్ లో అత్యధికంగా 299 కిలోమీటర్ల వేగం నమోదైంది.

దాదాపు 10 కిలోమీటర్ల పాటు నిలకడగా 200 కిమీ వేగంతో వెళ్లాడు.అంత వేగంతో బైక్ పై వెళ్ళడం చాలా ప్రమాదకరం అని, ఆ వేగంతో అతనితో పాటు మిగిలిన వారి ప్రాణాలని కూడా అతను రిస్క్ లో పెట్టాడని ట్వీట్ చేశారు.

అతని బైక్ స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

బాబు అల్లుడు కావడం ఎన్టీఆర్ దురదృష్టం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వైరల్!