అయ్యో బండ్లన్న ఎంత కష్టం వచ్చిందే నీకు.. ఆచార్య కాల్‌ కోసం వెయిటింగ్‌

నటుడిగా కెరీర్‌ ను ఆరంభించి అదృష్టం కొద్ది నిర్మాతగా మారిన బండ్ల గణేష్‌ అనూహ్యంగా స్టార్‌ ప్రొడ్యూసర్ గా మారి అదే తరహా లో నిరాశ పర్చాడు.

వరుసగా అట్టర్ ప్లాప్‌ లు పడటం తో కమర్షియల్‌ గా ఆయన కోలుకోలేక పోయాడు.

ఆర్థికంగా ఆయన మళ్లీ పుంజుకుని పవన్‌ కళ్యాణ్ తో సినిమాను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఆ మద్య ఒక సారి పవన్‌ కళ్యాణ్ తో సినిమా తీయబోతున్నాను అంటూ ప్రకటించాడు.

ఆ సినిమా ఉండే అవకాశాలు లేవని ఇప్పటికే తేలిపోయింది.ఆ మద్య బండ్ల గణేష్ ఆడియో ఒకటి బయటకు వచ్చింది.

అప్పటి నుండి ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారు అయ్యింది.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక ముందు నుండే త్రివిక్రమ్‌ తో బండ్ల గణేష్ కు పడటం లేదు.

పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం.అందుకే బండ్ల గణేష్‌ ను పక్కన పెట్టే అవకాశం ఉందని అంతా భావించారు.

అంతా అనుకున్నట్లుగానే బండ్ల గణేష్ ను భీమ్లా నాయక్‌ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కు పిలువలేదు.

ఇప్పుడు ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం బండ్ల గణేష్ వెయిట్‌ చేస్తున్నాడు.

ఆ సందర్బంగా అయినా చిత్ర యూనిట్ సభ్యుల నుండి పిలుపు వస్తుందేమో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎక్కడ జరిగినా కూడా వెళ్లేందుకు బండ్లన్న సిద్దంగా ఉన్నాడట.

ఇటీవల ఆ విషయాన్ని స్వయంగా మీడియా ముందు చెప్పుకొచ్చాడు.కాని ఆయనకు ఆహ్వానం అందడం కష్టమే అనది ఇండస్ట్రీ వర్గాల టాక్.

చిరంజీవి లేదా కొరటాల శివ ఓకే అంటే బండ్ల గణేష్‌ కు ఆహ్వానం వెళ్తుంది.

ఒక వేళ ఆహ్వానం లేకున్నా కార్యక్రమంలో హాజరు అయితే బండ్ల గణేష్ కు మాట్లాడే అవకాశం దక్కడం అనుమానమే.

ఒక్క సారి బండ్ల గణేష్ కు అవకాశం వస్తే బాగుండు అంటూ మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.