తప్పు చేసి దొరికిపోయిన బండ్ల గణేష్.. జనసేనపై షాకింగ్ కామెంట్లు చేస్తూ?
TeluguStop.com
పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య కోట్ల సంఖ్యలో ఉంది.
సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ పారితోషికం సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.పవన్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు లేకపోయినా పాన్ ఇండియా హీరోల స్థాయిలో పవన్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
జనసేన పార్టీని ఏపీలో బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ అభిమాని అయిన బండ్ల గణేష్ తాజాగా పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ లో చేసిన చిన్న పొరపాటు వల్ల నెటిజన్లు బండ్ల గణేష్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
బండ్ల గణేష్ తన ట్వీట్ లో " జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక గొప్ప శక్తిగా అవతరించిన పోతుంది" అంటూ బండ్ల గణేష్ మొదట ట్వీట్ చేశారు.
అయితే చివరి రెండు పదాలు తప్పుగా ఉండటంతో నెటిజన్లు బండ్ల గణేష్ ను ట్రోల్ చేశారు.
"""/"/
ఆ తర్వాత బండ్ల గణేష్ తప్పును సరిదిద్దుకుని "తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ మహాశక్తిగా అవతరించబోతుంది" అంటూ బండ్ల గణేష్ అప్పటికే తప్పును సరిదిద్దుకున్నారు.
అయితే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అప్పటికే వైరల్ కావడంతో నెటిజన్లు ఆ ట్వీట్ గురించి తమదైనశైలిలో కామెంట్లు చేశారు.
మరోవైపు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ కు సంబంధించిన ప్రకటన వచ్చింది.
గత కొన్నిరోజుల నుంచి ప్రచారంలో ఉన్న భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు.
పవన్ మూవీ కొత్త టైటిల్ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.పవన్ హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ తర్వాత తెరకెక్కనున్న మూవీ ఇదే కావడం గమనార్హం.
ఈ న్యాచురల్ క్రీమ్ తో వైట్ అండ్ స్మూత్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?