వాళ్లను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ సంచలన పోస్ట్.. ఆ కొందరు ఎవరంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే.
సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలోనే వార్తల్లో నిలుస్తూ ఉంటారు బండ్ల గణేష్(bandla Ganesh).
పాలిటిక్స్ విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఈయన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.
""img Src=" " /
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ ఇటీవల సినిమాకి చెందిన కొందరు విషయంలో పెట్టిన ఒక షాకింగ్ పోస్ట్ వైరల్ గా మారింది.
తన ట్విట్టర్ ఖాతా వేదికగా తన అభిమాన రాజకీయ నాయకుడు తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (revanth Reddy)తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు కొందరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
అయితే దీనిపై తన పోస్ట్ వైరల్ గా మారింది.గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు.
తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. """/" /
టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం (CM)గారు కావలెను.
కొందరిని మాత్రం టార్గెట్ చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది.దీనితో టికెట్ రేట్స్ కోసం మాత్రమే సీఎం అవసరాన్ని చూసే ఆ కొందరు ఎవరు అనే టాక్ స్టార్ట్ అయ్యింది.
కేవలం టికెట్ రేట్లను పెంచుకోవడం కోసమే అలా రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపినట్లుగా పోస్టులో రాసుకొచ్చారు బండ్ల గణేష్(Bandla Ganesh).
కేవలం అవసరం ఉంది కాబట్టే శుభాకాంక్షలు తెలిపారు అన్న అర్థం వచ్చేలా రాసుకోచ్చారు.
మరి ఎవరిని ఉద్దేశించి బండ్ల గణేష్ అలాంటి ట్వీట్ చేశారు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.