రవితేజను మోసం చేసినందుకు చాలా ఫీలయ్యాను.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బండ్ల గణేష్( Bandla Ganesh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన పరోక్షంగా పలువురిని టార్గెట్ చేస్తే సోషల్ మీడియా వేదికగా పలు వివాదాస్పదమైనటువంటి ట్వీట్స్ చేస్తూ ఉంటారు.
ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ కి సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో రవితేజను(Raviteja) మోసం చేసినట్లు తెలియజేశారు. """/" /
ఈ విధంగా బండ్ల గణేష్ రవితేజను ఎందుకు మోసం చేశారో అసలు మోసం చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే.
రవితేజ గారికి నేను 25 ఎకరాల పొలం అమ్మాను ఆయన కూడా ఆ పొలాన్ని చాలా ప్రేమగా కొనుక్కున్నారు.
అయితే ఆ పొలం కింద నాది 30 ఎకరాల పొలం ఉంది.30 ఎకరాల పొలం అమ్మాలి అంటే రవితేజకు అమ్మిన 25 ఎకరాల పొలం ఇస్తేనే తీసుకుంటామని చెప్పారు దాంతో నేను రవితేజ వద్దకు వెళ్లి ఆయనకు అబద్ధం చెప్పానని తెలిపారు.
రవితేజ వద్దకు వెళ్లి అన్న నీ పొలం మీద గవర్నమెంట్ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆ పొలం అమ్మేయడమే బెటర్ అని చెప్పడంతో రవితేజ గారు ఆ పొలాన్ని అమ్మేశారు.
"""/" /
ఈ విధంగా రవితేజ గారు పొలం అమ్మినప్పుడు చాలా బాధపడ్డాను నేను తనని మోసం చేస్తున్నాను అనిపించింది ఎప్పటికైనా నేను ఆయనకు రుణం తీర్చుకోవాలి అనుకున్నాను.
అయితే నేను రవితేజ దగ్గరకు వెళ్లి అన్న నేను నిన్ను మోసం చేశానని చెప్పడంతో రవితేజ నాకు తెలుసులేరా అంటూ సమాధానం చెప్పారు.
ఇలా రవితేజను మోసం చేశాను అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎప్పుడు వచ్చామని కాదమ్మా.. రికార్డ్స్ బద్దలయ్యా లేదా (వీడియో)