పవన్ ‘ఫ్యాన్స్’కి బండ్ల గణేష్ క్షమాపణలు.. కారణం అదే!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఎంతమంది ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అందుకే అతనిపై ఏ ఒక్కరు విమర్శ చేసిన అసలు ఊరికే వదలరు.పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తే నెత్తిపైన.

విమర్శిస్తే కాళ్ళ కిందకి వేసి తొక్కేస్తారు.ఇంకా ఇప్పుడు బండ్ల గణేష్ పరిస్థితి కూడా అదే అనుభవం ఎదురైంది.

పాపం పవన్ కళ్యాణ్ ఎం చెయ్యలేదు.ఎటువంటి తప్పు చెయ్యలేదు అయినా సరే అతన్ని తిడుతున్నారు.

ఏం జరిగింది అని అనుమానం కదా! అదేనండీ.ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ అనే పేరుతో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

ఇంకా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తున్నాడు.

దీంతో రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన ఓ ప్రమోషన్ వీడియోకి బండ్ల గణేష్ లైక్ కొట్టాడు.

ఇంకా అంతే.బండ్ల గణేష్ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయిపోయారు.

ఎందుకంటే బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ కి అభిమానినే.అలాంటిది రామ్ గోపాల్ వర్మ పోస్ట్ కు ఎలా లైక్ కొడుతారు అంటూ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చెయ్యడంతో బండ్ల గణేష్ దీనిపై స్పందించాడు.

''ఒట్టు ఏదో పొరపాటున జరిగిపోయింది.ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయను… సారీ చెబుతున్న అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నాడు'' దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్… ఓకే చెప్పిన అల్లు అర్జున్?