చిరు ట్వీట్ పై స్పందించిన బండ్ల గణేష్.. సంక్రాంతి మొనగాడు మా అన్న చిరంజీవి అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు చిరంజీవి.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు చిరంజీవి.

తనకూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు. """/" / ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు అయ్యి ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

దీంతో అభిమానులు తదుపరి సినిమా పై అంచనాలు పెట్టుకోగా తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ టాక్ ని తెచ్చుకోవడంతోపాటు కలెక్షన్ లో వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

ఇకపోతే తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చాడు మెగాస్టార్.

"""/" / అందరికీ పచ్చ తోరణాలు, ముంగిట ముగ్గులు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

సంవత్సరం పొడవునా అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, పాడి పంటలు, భోగభాగ్యాలు లోడింగ్ అవుతూనే ఉండాలి అని ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ ట్వీట్ పై స్పందించిన అభిమానులు మెగాస్టార్ కి కూడా శుభాకాంక్షలు పెద్ద ఎత్తున తెలియజేశారు.

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ పై స్పందించిన బండ్ల గణేష్, సంక్రాంతి మొనగాడు మా అన్న చిరంజీవి అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే మీ పల్చటి జుట్టు దట్టంగా మారడం పక్కా!