వామ్మో.. ఒక్కరోజుకు బండ్ల గణేష్ రెమ్యునరేషన్ అన్ని లక్షల రూపాయలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా, నిర్మాతగా బండ్ల గణేష్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

రాజకీయాల్లో కూడా సక్సెస్ కావాలని బండ్ల గణేష్ ప్రయత్నాలు చేయగా ఆ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు.

ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ పలు సందర్భాల్లో వివాదాస్పద ట్వీట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

మరికొన్ని రోజుల్లో రామారావ్ అన్ డ్యూటీ థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తొట్టెంపూడి వేణు కీలక పాత్రలో నటించారనే సంగతి తెలిసిందే.

ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పాలని దర్శకుడు శరత్ మండవ త్ బండ్ల గణేష్ ను సంప్రదించారని సమాచారం.

శరత్ మండవ ఒక్కరోజు వర్క్ అని చెప్పగా బండ్ల గణేష్ డబ్బింగ్ చెప్పాలంటే తనకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారని సమాచారం.

బండ్ల గణేష్ చెప్పిన అమౌంట్ విని షాకవ్వడం దర్శకుడి వంతైంది.అయితే ఈ విషయం తెలిసి వేణు తొట్టెంపూడికి బండ్ల గణేష్ వాయిస్ సూట్ అయ్యే ఛాన్స్ లేదని దర్శకుడు ఎందుకు ఆ విధంగా ఆలోచించాడో అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/"/ మరోవైపు వరుసగా ప్రమోషన్లను నిర్వహిస్తూ రామారావ్ ఆన్ డ్యూటీ మేకర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు.

రవితేజ గత సినిమా ఖిలాడీ ఫ్లాప్ అయినా రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా హక్కులు రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచింది.రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాతో రవితేజ కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

రవితేజ కెరీర్ కు రామారావ్ ఆన్ డ్యూటీ మూవీ సక్సెస్ కీలకం కానుందని చెప్పవచ్చు.

దేవర, పుష్ప 2 లా పరిస్థితి ఏంటి..? ఇవి రెండు హిట్టు అవుతాయా..?