అక్కడి నుంచి తిరుపతికి 500 కిలోమీటర్ల పాదయాత్ర.. బండ్ల గణేష్ నిర్ణయానికి కారణమిదే!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు బండ్ల గణేష్( Bandla Ganesh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేష్.ఈయన సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.

కాగా బండ్ల గణేష్ ఏం చేసినా సంచలనమే.నటుడు నుంచి నిర్మాతగా మారిన కూడా ఆయన రాజకీయాల కోసం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే రాజకీయాలు పెద్దగా కలిసి రాకపోవడంతో బండ్ల గణేష్ మళ్ళీ నిర్మాతగా మారి రీ ఎంట్రీ ఇస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

"""/" / ఇలాంటి తరుణంలో ఇప్పుడు అనూహ్యంగా ఆయన పాదయాత్ర వార్త తెరపైకి వచ్చింది.

షాద్ నగర్ లోని తన నివాసం నుంచి తిరుమలకు( Tirumala ) పాదయాత్ర చేయాలని బండ్ల గణేష్ నిర్ణయించుకున్నారట.

త్వరలోనే ఈ పాదయాత్ర ప్రారంభం కానుందని తెలుస్తోంది.షాద్ నగర్ నుంచి తిరుమల మధ్య 500 కిలో మీటర్లకు పైగా దూరం ఉంటుంది.

ఇంత దూరం పాదయాత్రలు ఎన్నికలకు ముందు బడా నాయకులు మాత్రమే చేస్తుంటారు.అలాంటిది ఇప్పుడు బండ్ల గణేష్ పాదయాత్రకు( Bandla Ganesh Padayatra ) సిద్ధమవ్వడం అన్నది నిజంగా ఆసక్తికర విషయం అని చెప్పాలి.

"""/" / అయితే ఈ పాదయాత్ర బండ్ల నా దేనికోసం చేస్తున్నారో తెలియాల్సి ఉంది.

కాగా బండ్ల గణేష్ కొంతకాలంగా సినిమాలను, రాజకీయాలను పక్కన పెట్టి వ్యాపారాల పైనే పూర్తి ఫోకస్ పెడుతున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోనూ, అలాగే రాజకీయాల్లోనూ సత్తా చాటాలని చూస్తున్నారు.అందుకే పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.

ఈ పాదయాత్ర తర్వాత రాజకీయాలలో ఫుల్ బిజీ బిజీగా మారబోతున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాలపై బండ్లన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.