దేవరను మరచి రవితేజ వెంట పడ్డావు అనే ప్రశ్నకు బండ్ల గణేష్ సూపర్‌ ఆన్సర్‌

బండ్ల గణేష్ అనగానే ఎక్కువ శాతం మంది పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ గుర్తు చేసుకుంటారు.

పవన్ కళ్యాణ్ అంటే పడి చస్తాను అంటూ బండ్ల గణేష్ గతం లో పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తాయి.

పవన్ కళ్యాణ్ ని ఒక దేవుడు.దేవర అంటూ బండ్ల గణేష్ సంబోధిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా అభిమానుల చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి.

అలాంటి బండ్ల గణేష్ ఈ మధ్య కాలం లో ఎక్కువగా రవితేజ పేరును జపిస్తున్నాడు.

ఎప్పుడైతే ధమాకా సినిమా యొక్క సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ మాట్లాడాడో అప్పటి నుండి సీన్ రివర్స్ అయినట్లుగా అనిపిస్తుంది.

సోషల్ మీడియా లో రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ గురించి పోస్ట్ లు పెట్టే బండ్ల గణేష్ ఈ మధ్య కాలం లో వరుసగా రవితేజ గురించి పోస్ట్ లు పెడుతున్నాడు.

అన్ని విధాలుగా రవితేజ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. """/"/ ఈ నేపథ్యం లో కొందరు రవితేజ తో బండ్ల గణేష్ సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం చేస్తున్నారు.

తాజాగా ఒక వ్యక్తి ట్విట్టర్ ద్వారా.ఏందన్నా బండ్లన్న, బండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దారి లో కాకుండా మాస్ మహారాజా రవితేజ గారి రోడ్డు లోకి మళ్ళింది.

దేవర ను మరిచావా, భక్తి తగ్గిందా? అంటూ ట్వీట్ చేశాడు. """/"/దానికి బండ్ల గణేష్ స్పందించి నేను హిందువుని శ్రీశైలం వెళ్తాను, తిరుపతి వెళ్తాను, శబరిమల వెళ్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

బండ్ల గణేష్‌ సమాధానం నిజంగా క్రియేటివ్ గా ఉంది.ఒక వైపు పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తూనే మరో వైపు తాను రవితేజను కూడా అభిమానిస్తాను ఆరాధిస్తాను అంటూ సమాధానం ఇచ్చాడు.

మొత్తానికి బండ్ల గణేష్ రవితేజని ఈ మధ్య కాలంలో తెగ పొగడ్తలతో ముంచేస్తున్నాడు కనుక కచ్చితంగా ఏదో వ్యవహారం ఉండే ఉంటుంది.

నిర్మాణంలో మళ్లీ బండ్లన్న బిజీ అవ్వాలి అంటే రవితేజ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలి.

ఈ సినీ సెలబ్రిటీల నిజమైన పేర్లు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..