ఎందరో లక్ష్మణులకు వదినగా ఉండడం మాకు సంతోషం: బండ్ల గణేష్
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఈయన తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.ఇకపోతే బండ్ల గణేష్ వ్యక్తిగతంగా మెగా ఫ్యామిలీకి పెద్ద అభిమాని అనే విషయం మనకు తెలిసిందే.
ఇలా మెగా కుటుంబం గురించి తరచూ ఈయన గొప్పలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 18వ తేదీ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పుట్టినరోజు కావడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
"""/" /
ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.సీతాదేవి అంత ఓర్పు.
భూదేవంత గొప్పతనం.లక్ష్మీదేవి లాంటి నవ్వు.
రాముడి లాంటి భర్తకు అర్ధాంగిగా.వజ్రం లాంటి బిడ్డకు తల్లిగా.
ఎందరో లక్ష్మణులకు వదినగా మీరుండటం మాకెంతో సంతోషం.ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నా అంటూ సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి సురేఖ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
"""/" /
ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.అయితే ఈయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.
కెరియర్ మొదట్లో కమెడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగిన బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా మారి మంచి విజయాలను అందుకున్నారు.
ఇక ప్రస్తుతం ఎలాంటి సినిమాలను నిర్మించక పోయిన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఈయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
ఆ విషయంలో ప్రభాస్ ను ఫాలో అవుతున్న రామ్ చరణ్, తారక్.. ఏం జరిగిందంటే?