ఊరు మొత్తానికి సరిపోయే టపాకాయలతో బండ్ల గణేష్.. పోటోలు వైరల్!

దీపావళి పండుగను పురస్కరించుకొని సెలబ్రిటీలందరూ కూడా ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకున్నారని తెలుస్తుంది.

ఇక దీపావళి ( Deepavali ) పండుగ వస్తే నిర్మాత బండ్ల గణేష్ ( Bandla Ganesh ) చేసే హడావిడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ప్రతి ఏడాది ఈయన ఒక టపాకాయల షాపులో ఉన్న టపాసులు అన్నీ కూడా ఈయన ఇంటి ముందు ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.

వివిధ రకాల టపాకాయలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వాటన్నిటిని అందంగా పేర్చి వాటి ముందు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా దీపావళి పండుగను అదే స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్నారని తెలుస్తుంది.

"""/" / గతంలో కంటే ఈసారి మరింత గ్రాండ్గా పెద్ద ఎత్తున టపాకులను తీసుకోవచ్చి వాటి ముందు చాలా స్టైలిష్ గా కూర్చుని బండ్ల గణేష్ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఈయన తాను వినాయక చవితి దసరా పండుగలను అసలు జరుపుకోలేదని కానీ దీపావళి పండుగను మాత్రం చాలా ఘనంగా జరుపుకోవాలని ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

"""/" / బండ్ల గణేష్ అన్న ఊరు మొత్తం కాల్చడానికి టపాకాయలు తీసుకొచ్చావా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం బయట క్రాకర్స్ ( Crackers ) షాప్ లో కూడా ఇన్ని టపాసులు లేవన్న, బండ్లన్న దివాళీని ఎప్పుడు నిరుత్సాహపరచాడు.

వీటన్నింటినీ కొనుగోలు చేయడానికి ఎంత మొత్తంలో ఖర్చు చేశావన్న అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.

ఇక కొందరు బండ్ల గణేష్ నటించిన ఒక సినిమాలోని కామెడీ సీన్ ని పోస్టు చేస్తూ వస్తున్నారు.

బండ్ల గణేష్ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.

మోహన్ బాబు పై పరోక్షంగా కామెంట్స్ చేసిన చిరు.. స్పందించిన మనోజ్?