ధర్మం మార్కెట్లో దొరకదు బ్రదర్ అంటూ ప్రభాస్ పై బండ్లన్న హాట్ కామెంట్స్?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా బండ్లగణేష్ ఎక్కువగా మెగా హీరోల గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ మెగా అభిమానులను సంతోష పెడుతుంటారు.
మెగా కుటుంబానికి సంబంధించిన హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగా కుటుంబం పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేస్తుంటారు.
ఇలా ఎప్పుడు మెగాస్టార్ గురించి మాట్లాడే బండ్లగణేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చారు.
రెబల్ స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ప్రభాస్ గురించి వరుస ట్వీట్లు చేస్తూ ప్రభాస్ అభిమానులను సందడి చేశారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ ఫోటోలను షేర్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
"""/"/
ధర్మం మార్కెట్ లో దొరకదు బ్రదర్.అది బ్లడ్ లో ఉండాలి అది ఇక్కడ నిండుగా ఉంది అమెరికా వెళ్లినవారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇండియా వచ్చినవారు ప్రభాస్ సినిమా చూడకుండా ఉండరు అంటూ ప్రభాస్ గురించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
అదేవిధంగా పట్టాభిషేకానీ వెళ్తున్న అశోకచక్రవర్తిలా.మహాభారతంలో యుద్ధానికి బయలుదేరుతున్న అర్జునుడిలా ఉన్నాడంటూ ప్రభాస్ గురించి వరుస ట్వీట్లు చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
"""/"/
ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.త్వరలోనే ఆది పురుష్, సలార్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ బండ్ల గణేష్ ప్రభాస్ గురించి చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.
స్టార్ హీరో అల్లు అర్జున్ కు తత్వం బోధపడిందా.. ఇకనైనా ఆ ఒక్క విషయంలో మారతారా?