ఎన్టీఆర్ నా టైటిల్ ని దొబ్బేసాడు అంటూ ట్విట్టర్ లో రచ్చ చేస్తున్న బండ్ల గణేష్

ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే ప్రారంభం అయ్యింది.హైదరాబాద్ చుట్టూ పక్క పరిసరాల్లో మరియు రామోజీ ఫిలిం సిటీ లో నెల రోజుల పాటు మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు, ఇప్పుడు రెండవ షెడ్యూల్ ని మొదలు పెట్టేందుకు సిద్ధం గా ఉంది.

మొదటి షెడ్యూల్ లో కొన్ని పార్టీ సన్నివేశాలు మరియు రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఒక రైల్వే స్టేషన్ సెట్ లో సైఫ్ అలీ ఖాన్ మరియు ఎన్టీఆర్ మధ్య ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు.

ఈ షెడ్యూల్ లో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) కూడా పాల్గొన్నది.

ఈ షెడ్యూల్ ప్రారంభం అయ్యే ముందు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని విడుదల చేసారు.

"""/" / ఈ సినిమాకి టైటిల్ గా 'దేవర'( Devara ) అని ఫిక్స్ చేసారు దర్శక నిర్మాతలు.

అయితే ఈ టైటిల్ పై ఇప్పుడు గొడవ మొదలైంది.అదేమిటి అంటే ట్విట్టర్ లో బండ్ల గణేష్( Bandla Ganesh ) ఒక ట్వీట్ వేస్తూ ' ఇది నేను రాబొయ్యే రోజుల్లో సినిమా తీసేందుకు రిజిస్టర్ చేయించుకున్న టైటిల్.

నేను మర్చిపోయేలోపు నా నుండి దొబ్బేసారు' అంటూ ఒక ట్వీట్ వేసాడు.ఈ ట్వీట్ కి ఫ్యాన్స్ నుండి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి.

బండ్ల గణేష్ మొదటి నుండి తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ని దేవర దేవర అని పిలుస్తూ ఉంటాడు.

ఆయనతో తియ్యబోయే సినిమా కోసమే ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్టు సమాచారం.

అందుకే ఇప్పుడు ఆ టైటిల్ ని ఎన్టీఆర్ మూవీ మేకర్స్ తనకి చెప్పకుండా దొబ్బేసారని ఆరోపిస్తున్నాడు.

బండ్ల గణేష్ ఈమధ్య ట్విట్టర్ లో చాలా వెరైటీ ట్వీట్స్ వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన కొన్ని పరోక్ష సెటైర్లు వేసాడు.

"""/" / గతం లో అయితే ఒక ప్రముఖ మీడియా ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా పలు ఆరోపణలు చేసాడు.

నేను 'టెంపర్' మూవీ షూటింగ్ చేస్తున్న సమయం లో ఎన్టీఆర్ డబ్బింగ్ ఒకటి బ్యాలన్స్ ఉండేదని, అప్పుడు నేను ఆయనకీ ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ లో కొంత భాగం బ్యాలన్స్ ఉందని,పూర్తి పెమేంట్ చేస్తే కానీ డబ్బింగ్ చెప్పను అంటూ ఎన్టీఆర్ గొడవకి దిగాడని బండ్ల గణేష్ అప్పట్లో చేసిన కొన్ని కామెంట్స్ సెన్సేషన్ అయ్యింది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది.ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ విషయం లోనే గొడవ పడడాన్ని చూస్తుంటే ఎన్టీఆర్ మీద బండ్ల గణేష్ కక్ష కట్టాడా అని అందరూ అనుకుంటున్నారు.

మరి దీని పై ఆయన గొడవ ఎంత దాకా తీసుకెళ్తాడో చూడాలి.ఇక 'దేవర' చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కాబోతుంది.

త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్ కౌర్.. అసలేం జరిగిందంటే?