నందమూరి ఫ్యామిలీతో దూరం గురించి బండ్ల గణేష్ అలా అన్నారా.. ఏం చెప్పారంటే?
TeluguStop.com
స్టార్ హీరో బాలయ్య( Balakrishna ) అందరితో సరదాగా ఉండటానికి ఇష్టపడతారు.అయితే బాలయ్యకు కోపం వస్తే మాత్రం మామూలుగా ఉండదని ఆయన కోపాన్ని ఎవరూ తట్టుకోలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
బండ్ల గణేష్( Bandla Ganesh ) ఒక ఇంటర్వ్యూలో బాలయ్య గురించి కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
నచ్చిన వాళ్లు నా నుంచి ల్యాండ్ కొనుకున్నారని బండ్ల గణేష్ అన్నారు.నా దగ్గర 60 లక్షల రూపాయలకు పొలం కొనుక్కొని తాజాగా 6 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని బండ్ల గణేష్ వెల్లడించారు.
మా నాన్న ఎన్టీఆర్ ఫ్యాన్(
NTR ) అని నేను చిరంజీవి అభిమానినని( Chiranjeevi ) ఆయన అన్నారు.
కమ్యూనిటీ కూడు పెడుతుందా అని బండ్ల గణేష్ తెలిపారు.నందమూరి ఫ్యామిలీతో(
Nandamuri Family ) దూరం లేదని జూనియర్ ఎన్టీఆర్ తో( Jr NTR ) రెండు సినిమాలు తీశానని ఆయన కామెంట్లు చేశారు.
బాలయ్యతో మిత్రుత్వం లేదని శత్రుత్వం లేదని బండ్ల గణేష్ అన్నారు. """/" /
నాకు బాలయ్యపై కోపం ఎందుకుంటుందని ఆయన తెలిపారు.
ఇండస్ట్రీలో ఏరోజు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని బండ్ల గణేష్ వెల్లడించారు.నేను నా జీవితంలో గతాన్ని మరిచిపోలేనని ఆయన తెలిపారు.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారం బండ్ల గణేష్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.
"""/" /
బండ్ల గణేష్ నిర్మాతగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బండ్ల గణేష్ అడిగితే డేట్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారు.బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఏ ట్వీట్ చేసినా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
బండ్ల గణేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.రాబోయే రోజుల్లో బండ్ల గణేష్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.
సీనియర్ హీరోలు ఆ విషయంలో యంగ్ హీరోలకు పోటీ ఇవ్వలేకపోతున్నారా..?