బండ్ల గణేష్‌ కి ఇంతగా కాలటంకు కారణం ఏమై ఉంటుందబ్బా?

నటుడిగా కెరీర్‌ ను ఆరంభించి సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగిన బండ్ల గణేష్( Bandla Ganesh ) ఆ మధ్య నిర్మాతగా వరుస సినిమాలను నిర్మించాడు.

పవన్‌.ఎన్టీఆర్‌.

అల్లు అర్జున్‌.రామ్‌ చరణ్‌.

రవితేజ వంటి స్టార్స్ తో సినిమాలు నిర్మించడంతో బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ అనే టాక్ ఏర్పడింది.

పవన్‌ కళ్యాన్‌( Pawan Kalyan ) తో ఉన్న సన్నిహిత్యం కారణంగా బండ్ల గణేష్‌ కి మంచి అవకాశాలు లభించాయి.

"""/" / మొన్నటి వరకు కూడా బండ్ల గణేష్ యొక్క ప్రతి సినిమా వేడుకలో కూడా పాల్గొంటూ సందడి చేసేవాడు.

కానీ ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ యొక్క సందడి లేదు.అందుకు కారణం పవన్‌ కళ్యాణ్ టీమ్‌ బండ్ల గణేష్ ను పక్కకి పెట్టడమే అనే విషయం తెల్సిందే.

పవన్ కళ్యాణ్ స్వయంగా బండ్ల గణేష్‌ ను పక్కకు పెట్టడంకు కారణం ఒక దర్శకుడు అనే ప్రచారం జరుగుతోంది.

ఆ ప్రచారం నిజమే అన్నట్లుగా బండ్ల గణేష్ ఈమధ్య వరుసగా ఆ దర్శకుడి గురించి ట్వీట్స్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు.

"""/" / ఓ రేంజ్ లో పవన్‌ కళ్యాణ్ ను అభిమానించే బండ్ల గణేష్ ని ఇప్పుడు దూరం పెట్టాడు అంటే కారణం ఆ దర్శకుడు ( Director )అంటూ ఇండస్ట్రీలో కూడా టాక్‌ వినిపిస్తుంది.

గతంలో ఒక సారి పవన్ ను బండ్ల గణేష్ మోసం చేయడం జరిగింది.

ఆ సమయంలో బండ్ల గణేష్ ను పవన్ క్షమించాడు.మళ్లీ ఏం అయ్యిందో తెలియదు కానీ బండ్ల గణేష్ ను పక్కకు పెట్టాడు.

అది కూడా ఆ దర్శకుడు చెప్తేనే పవన్ అలా చేశాడు అంటూ బండ్ల గణేష్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు.

ఇంతకు పవన్‌ తో బండ్ల గణేష్ కు చెడిందా లేదంటే ఆ దర్శకుడు ఏం చేశాడు.

ఇంతకు ఆ దర్శకుడికి బండ్ల గణేష్‌ కు మధ్య జరిగింది ఏంటి అంటూ తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ కానీ ఈ లోపం ఒకటి సరి చేసుకోవాలి..!