బండ్ల మళ్లీ పొలిటికల్‌ హడావుడి… అవసరమా భయ్యా?

నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించి.ఆ తర్వాత నిర్మాతగా మారి రామ్ చరణ్.

( Ram Charan ) ఎన్టీఆర్‌.అల్లు అర్జున్‌.

పవన్ కళ్యాణ్‌ వంటి సూపర్ స్టార్‌ హీరోలతో సినిమా లను నిర్మించిన బండ్ల గణేష్ ( Bandla Ganesh ) గత కొంత కాలంగా సినిమా లకు దూరంగా ఉంటున్నాడు.

ఆయన నిర్మాతగా మళ్లీ ప్రయత్నాలు చేసినా కూడా అవేవి కూడా వర్కౌట్ అవ్వలేదు.

బండ్ల గణేష్‌ ఆ మధ్య పవన్‌ కళ్యాణ్ తో సినిమా ను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు.

కానీ పవన్ కి ఆమడ దూరంలో బండ్ల ఉండాల్సిన పరిస్థితి. """/" / పవన్ వద్ద ఉన్న వారు కొందరు బండ్ల గణేష్ ను దూరం పెట్టారు.

దాంతో పవన్ మరియు బండ్ల గణేష్‌ మధ్య దూరం చాలా పెరిగింది.అందువల్ల బండ్ల గణేష్‌ యొక్క పరిస్థితి సినిమా ఇండస్ట్రీ లో ఆశించిన స్థాయి లో బాగాలేదు అనేది వాస్తవం.

అందుకే మళ్లీ రాజకీయాల వైపు బండ్ల గణేష్ పరుగులు తీస్తున్నాడా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది.

"""/" / గత ఎన్నికల సమయంలో బండ్ల గణేష్‌ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి మరీ పార్టీ లో జాయిన్‌ అయిన బండ్ల గణేష్ ఆ తర్వాత రాష్ట్రం లో పార్టీ విజయం కోసం ప్రచారం చేశారు.

కానీ వర్కౌట్ అవ్వలేదు.కొన్నాళ్లకు తాను ఏ పార్టీకి అనుబంధం గా లేను.

నేను ఏ పార్టీ కోసం పని చేయడం లేదు అన్నట్లుగా ప్రకటించాడు.కానీ తాజాగా బట్టి విక్కమార్క ( Bhatti Vikramarka )పాద యాత్ర సందర్భంగా బండ్ల గణేష్ సందడి చేయడం మొదలుకుని ఆ తర్వాత పలువురు పార్టీ నాయకులను కలవడం ద్వారా మళ్లీ కాంగ్రెస్ లో బండ్ల గణేష్ అంటూ వార్తలు వస్తున్నాయి.

బండ్ల గణేష్‌ కాంగ్రెస్ లో రీ జాయిన్‌ అయ్యాడు అనే వార్తలు జోరుగా వస్తున్న నేపథ్యం లో కొందరు విమర్శలు చేస్తున్నారు.

బండ్ల గణేష్‌ కు పాలిటిక్స్ అచ్చి రావడం లేదు అనేది గతంలోనే నిరూపితం అయ్యింది.

మళ్లీ అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

వామ్మో.. కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని జ‌బ్బులా..?