'చరిత్ర కోసం మీరు కాదు.. మీ కోసం చరిత్ర దేవర'.. స్వామి భక్తిని మరోసారి చూపించిన బండ్లన్న..

చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు ఉన్నంత క్రేజ్ మరొక హీరోకు లేదు అంటే అతియసోక్తి కాదేమో.

ఆయన చేసే సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా పవన్ రేంజ్ మాత్రం కొంచెం కూడా తగ్గదు.

పవన్ కళ్యాణ్ కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.పవన్ కు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆయనను అమితంగా పూజించే భక్తులు చాలా మంది ఉన్నారు.

అందులో బండ్ల గణేష్ ముందు ఉంటారు.బండ్ల గణేష్ స్పీచ్ కోసం పవన్ అభిమానులు సైతం ఎదురు చూస్తూ ఉంటారు.

అయితే భీమ్లా నాయక్ ఈవెంట్ కు ఈయన కొన్ని కారణాల వల్ల హాజరు కాలేదు.

దీంతో ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందారు.అయితే తాజాగా భీమ్లా నాయక్ సినిమా పై బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.

ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మా దేవర నటించిన భీమ్లా నాయక్ కు బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని కోరుకుంటున్నానని ఆయన తెలుపారు.

"""/"/ అలాగే భీమ్లా నాయక్ సినిమాకు దిక్కులు పిక్కటిల్లేలా ఫ్యాన్స్ స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని.

చరిత్ర కోసం మీరు కాదు.మీ కోసం చరిత్ర దేవర అంటూ బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

"""/"/ అలాగే మరోసారి ఈయన స్వామి భక్తిని చూపించాడు.ఈ ట్వీట్ పవర్ స్టార్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

అలాగే ఈయన మరో ట్వీట్ లో మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్ మై గాడ్ నేమ్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు.

బండ్ల గణేష్ చేసిన ట్వీట్ లను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వాటిని మరింత వైరల్ చేస్తున్నారు.

కమిటీ కుర్రాళ్ళు సినిమా కి నేషనల్ అవార్డు వస్తుందా..?