హైదరాబాద్ ఉగ్ర కుట్రపై బండి సంజయ్ రియాక్షన్

హైదరాబాద్ ఉగ్ర కుట్రపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

యువతను మభ్యపెట్టి ఉగ్రవాదులుగా మారుస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో కొత్త జీహాదీ మొదలైందన్నారు.

జీహాదికి ప్రధాన కేంద్రం హైదరాబాద్ కావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.కర్ణాటకలో ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించాల్సింది పోయి దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకునే సంస్థలపై నిషేధం విధిస్తారట అంటూ విమర్శలు చేశారు.

పాకిస్థాన్ తరువాత ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందని ఆరోపించారు.రాజకీయం కోణంలో చూడకుండా ప్రజలను సీఎం కేసీఆర్ కాపాడాలని కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని తెలిపారు.ఈ క్రమంలో మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలని సూచించారు.

విశ్వక్ సేన్ పరిస్థితి ఏంటి..? ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరో అవుతారా..?